Begin typing your search above and press return to search.

ఓ గాడ్‌... ఈ విచిత్రం చూడండి!

By:  Tupaki Desk   |   3 Sep 2015 1:18 PM GMT
ఓ గాడ్‌... ఈ విచిత్రం చూడండి!
X
వ‌ర్షాలు కుర‌వాల‌ని దేశ‌మంతా దేవుళ్ల‌కు పూజ‌లు చేస్తోంది. ఆ దేవుడు ఈ దేవుడు అని కాదు... ఎవ్వ‌రికి ఇష్ట‌మైన దేవుడిని వాళ్లు పూజిస్తున్నారు. వ‌రుణ‌దేవుడా క‌రుణించు అంటూ వేడుకొంటున్నారు. కానీ ఆ దేవుడు మాత్రం క‌నిక‌రించ‌డం లేదు. ఎండాకాలాన్ని త‌ల‌పిస్తున్న‌ట్టుగా ఉంది వాతావ‌ర‌ణం. న‌దులు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. రైతులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కి పాల్ప‌డుతున్నారు. అయినా స‌రే... దేవుడికి మాత్రం ద‌య క‌ల‌గ‌డం లేదు. ఇక ఏం చేయాలి? ఇప్పుడేం చేయాలి?

మ‌న మొర‌ని దేవుడు ఎందుకు ఆల‌కించ‌డం లేదో తెలియ‌దు కానీ... ఈ ఫొటోల్ని చూస్తే మాత్రం ఆయ‌న క‌చ్చితంగా స్పందించే అవ‌కాశం ఉంది. ఆ ఆనందంలో ఏదో ఒక‌టి చేసే అవ‌కాశం కూడా ఉంది. ఈ ఫొటోల్లో అంతటి విశేషం ఉంది మ‌రి. అవునో కాదో... మీరే చెప్పండి. దేవుడు కంటే దెయ్యాన్నే ఎక్కువ న‌మ్ముతాన‌ని చెబుతుంటాడు రామ్‌ గోపాల్ వ‌ర్మ‌. దెయ్యాన్న‌యినా న‌మ్ముతాను కానీ దేవుడిని మాత్రం న‌మ్మ‌న‌ని వ్యాఖ్యానిస్తుంటాడ‌య‌న‌. సెంటిమెంట్ల‌కి పుట్టినిల్లు లాంటి సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్న‌ప్ప‌టికీ రామ్‌ గోపాల్ వ‌ర్మ ఎప్పుడూ దేవుడికి దండం పెట్టుకొన్న‌ది లేదు. తన సినిమాల ప్రారంభం రోజున కూడా కొబ్బ‌రికాయలు కొట్ట‌డం, పూజ‌లు చేయ‌డంలాంటివి అస్స‌లు చేయ‌డు. అలాంటి వ‌ర్మ ఇక్క‌డ దేవుడికి దండం పెట్టాడు. గ‌ణేషా అంటూ విన‌మ్రంగా వేడుకొంటున్నాడు. ఈయ‌న ఏం కోరుకొని దేవుడికి దండం పెట్టుకొంటున్నాడో తెలియ‌దు కానీ... ఈ ఫొటోలు చూశాక మాత్రం దేవుడికి అంద‌రి వ‌రాలూ తీర్చేసేంత ఆనందం క‌ల‌గ‌డం ఖాయం. ఈ ఫొటోల్ని దేవుడికి చూపించి ఇక వ‌ర్షాల‌కి సిద్ధ‌మైపోండి మ‌రి!