రానాను గుర్తించారట.. వర్మ కామెంట్

Sun Aug 13 2017 11:41:05 GMT+0530 (IST)

ఈ మధ్యకాలంలో మెగాస్టార్ అమితాబ్ నుండి మోహన్ బాబు వరకు.. అసలు రామ్ గోపాల్ వర్మ ఫ్లాపును ఇవ్వంది ఎవ్వరికి? అలా వర్మ నుండి ఫ్లాప్ స్ర్టోక్ తిన్న వ్యక్తుల్లో రానా దగ్గుబాటి కూడా ఉన్నాడు. ఇప్పుడు ''నేనే రాజు నేనే మంత్రి'' విజయవంతంగా దూసుకుపోవడంతో మనోడు రానాను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు.''రానా ఒక మహాద్భుతం అని నేను ఎప్పుడో నమ్మాను. అతన్ని ఒక పెద్ద ప్రొడ్యూసర్ మరియు స్టూడియో ఓనర్ కు పుట్టిన సాధారణ కొడుకు అని అందరూ అనుకున్నారు. అదే దృష్టితో చూశారు కూడా. అలాగే దర్శకుడు తేజ నా అసిస్టెంట్స్ అందరిలోకి చాలా ఇంప్రెసివ్ గయ్. ఎవరో తెలియని వ్యక్తిని రోడ్డు మీద నుండి తీసుకుని.. ఆ నితిన్ తో జయం అనే బ్లాక్ బస్టర్ తీసిన తన టాలెంట్ చూపించాడు. అటువంటిది ఈరోజు రానా ఒక అగ్ని పర్వతం స్థాయిలోకి ఎదిగిపోయాడు. నేనే ' డిపార్ట్ మెంట్ ' సినిమాతో ఫ్లాపిచ్చినా.. తేజ మాత్రం 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో భారీ హిట్టే ఇచ్చాడు. వాళ్ళకి కంగ్రాట్స్'' అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు వర్మ.

అయితే ఎప్పటిలాగానే రానాను పొగిడేస్తూ ఇతర సినిమాలపై రాళ్ళేశాడు ఈ దర్శకుడు. ''రానా నటనకు వస్తున్న పొగడ్తలు రివ్యూల పక్కన పెడితే.. అసలు ఎవ్వరూ ఈ సినిమాతో రిలీజైన మరో రెండు సినిమాల్లోని హీరోల గురించే మాట్లాడుకోవట్లేదు. కేవలం రానా గురించి ఎక్కడ చూసినా టాక్ అంతా'' అంటూ కామెంట్ చేశాడు వర్మ. పైగా ఒక అమ్మాయి తనకు మెసేజ్ పెట్టింది.. రాని ఉన్నాడు కాబట్టి నేనే రాజు నేనే మంత్రి హిట్ మిగతావి కాదు అంటూ చురకలు అంటిస్తున్నాడు.