Begin typing your search above and press return to search.

వ‌ర్మ మూడు జ‌న్మ‌ల‌కు ఫ్లాట్ చేసేసిందట‌!

By:  Tupaki Desk   |   6 May 2016 8:15 AM GMT
వ‌ర్మ మూడు జ‌న్మ‌ల‌కు ఫ్లాట్ చేసేసిందట‌!
X
మ‌త్తుక‌ళ్ల సోయ‌గంతో మ‌త్తెక్కించే భామ రాధికా ఆప్టే. తెలుగులో ఆమె ఎంట్రీ గ్లామ‌ర్ కి భిన్నంగా సాగిన‌ప్ప‌టికీ.. అమ్మ‌డి అందాలు త‌ర్వాత త‌ర్వాత బ‌య‌ట‌కు రావ‌టం.. వాటిని చూసినోళ్లంతా ఫిదా అయిపోవ‌టం తెలిసిందే. టాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్లు ఉన్నా.. ఎవ‌రికి లేని కొత్త‌ త‌ర‌హా ఫాలోయింగ్ రాధికా సొంతం.

అహ‌ల్య అనే బెంగాలీ షార్ట్ ఫిలింలో రాధికాను చూసినోళ్లు ఆమెకు ముప్ఫైఏళ్లంటే న‌మ్మ‌నే న‌మ్మలేదు. బింకం త‌గ్గ‌ని అందాల‌తో గిలిగింత‌లు పెట్టే రాధికా ఈసారి ఎఫ్ హెచ్ ఎం మ్యాగ్‌ జైన్ క‌వ‌ర్ పేజీ మీద ద‌ర్శ‌న‌మిచ్చిన తీరుకు కుర్ర‌కారు గొంతు త‌డారిపోతే.. మిగిలిన వారి ఇబ్బంది ఎంత‌న్న‌ది మాట‌ల్లో చెప్ప‌లేనిది.

త‌న తాజా ఫోటో షూట్‌ తో కోట్లాది మంది హార్ట్ బీట్ పెంచేసిన‌ రాధికా ఆరాధ‌క‌ జాబితాలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ కూడా చేరిపోవ‌టం ఇప్పుడు హ్యాట్ న్యూస్ గా మారింది. అతిలోక సుంద‌రి శ్రీదేవిని త‌ప్పించి మ‌రే హీరోయిన్ ను పొగ‌డ‌టం కానీ.. అందానికి ఫ్లాట్ అయ్యాన‌ని కానీ వ‌ర్మ నోటి వెంట రాలేదు. అలాంటిది ట్విట్ట‌ర్‌ లో తాజాగా త‌న గ‌డిచిన మూడు జ‌న్మ‌ల్లో ఇంత హాటెస్ట్ అమ్మాయిని చూడ‌లేదంటూ ట్వీటాడు.

శ్రీదేవి అందాన్ని త‌ప్ప ఇంత‌వ‌ర‌కూ ఇంకెవ‌రిని పొగడ‌ని వ‌ర్మకు ఉన్న‌ట్లుండి రాధికా ఆప్టే మీద మ‌న‌సు ఎందుకు ప‌డింద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న‌ మూడు జ‌న్మ‌ల‌కు టోకుగా ఫ్లాట్ చేసినట్లుగా వ‌ర్మ చెబుతున్న పొగ‌డ్త‌కు రాధికా ఆప్టే ఎలా రియాక్ట్ అవుతుందో..?