వర్మ మళ్లీ మొదలుపెట్టేశాడు..

Thu Jan 12 2017 15:06:19 GMT+0530 (IST)

నాగబాబుతో ఫైట్ అయ్యాక నాలుగైదు రోజుల పాటు సైలెంటుగా ఉన్న రామ్ గోపాల్ వర్మ మళ్లీ రెడీ అయిపోయాడు. నిన్న ‘ఖైదీ నెంబర్ 150’ హంగామా నడుస్తున్నంత సేపూ ఓపిగ్గా ఉన్న వర్మ.. ఈ రోజు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సందడి మొదలవగానే ట్విట్టర్లోకి అడుగుపెట్టాడు. మరోసారి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని పొగిడేస్తూ.. ‘ఖైదీ నెంబర్ 150’ మీద పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లతో చెలరేగిపోయాడు. ఆయన కామెంట్లు ఎలా ఉన్నాయో చూడండి.

‘‘అరువు తెచ్చుకున్న ఒక కథ తెలుగు సినిమాను పదేళ్లు వెనక్కి తీసుకెళ్లింది. కానీ 2 వేల ఏళ్ల నాటి ఒరిజినల్ స్టోరీతో గౌఃతమీపుత్ర శాతకర్ణి తెలుగు సినిమాను పదేళ్లు ముందుకు తీసుకెళ్లింది’’

‘‘బాహుబలితో మొదలై.. ఇప్పుడు శాతకర్ణితో తెలుగు సినిమా ఎన్నో అడుగులు ముందుకు వేసింది. ఇప్పటికీ మెగా జనాలు వాళ్లు ‘మిని’ అయిపోయిన సంగతి గుర్తించట్లేదు’’

‘‘గొప్ప సినిమా కోణంలో చూస్తే.. బాలయ్య తన వందో సినిమా ద్వారా మెగా కంటే 150 రెట్లు పెరిగారు’’

‘‘బాలయ్య.. క్రిష్ ఇద్దరూ తెలుగు ప్రేక్షకుల మేధస్సును గౌరవించారు. అందుకే పాత ఫార్ములా కథను వడ్డించకుండా పాథ్ బ్రేకింగ్ ఫిల్మ్ చేశారు’’

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/