Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ పెళ్లికి ప్ర‌త్య‌క్ష‌సాక్షి బాబేనా?

By:  Tupaki Desk   |   13 Oct 2018 5:53 AM GMT
ఎన్టీఆర్ పెళ్లికి ప్ర‌త్య‌క్ష‌సాక్షి బాబేనా?
X
వ‌ర్మను తిట్టిపోసేటోళ్లు ఉన్న‌ట్లే.. అత‌న్ని ఆకాశానికి ఎత్తేసేటోళ్లు ఉంటారు. అత‌గాడ్ని ప్ర‌కృతితో పోల్చేవాళ్ల‌కు కొద‌వ లేదు. ఎప్పుడు వ‌స్తాడో.. ఎలా వ‌స్తాడో అస్స‌లు అర్థం కాడు. వ‌చ్చిన ప్ర‌తిసారీ కొత్త‌గా వ‌స్తారు. కొత్త సంచ‌ల‌నాన్ని వెంట పెట్టుకొని తిరుగుతాడు. ఉన్న‌ట్లుండి మాయ‌మ‌వుతాడు. ఎక్క‌డ ఉంటాడో.. ఏం చేస్తాడో అర్థం కాడు. ఎప్ప‌టిక‌ప్పుడు సరికొత్త సంచ‌ల‌నాల‌తో అత‌గాడి పేరు క‌నిపిస్తూ ఉంటుంది.

ఆ మ‌ధ్య‌న శ్రీ‌రెడ్డి.. ప‌వ‌న్ ఇష్యూల‌తో వ‌ర్మ పేరు బాగా న‌లిగింది. గ‌తంలో ఏ వివాదంలో కానంత డ్యామేజీ శ్రీ‌రెడ్డి ఎపిసోడ్‌లో జ‌రిగింద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ఆ త‌ర్వాత ఏమైందో కానీ.. క‌నిపించ‌కుండా పోయాడు. త‌ర్వాత చాలా ప‌రిణామాలు చోటు చేసుకున్న వ‌ర్మ స్పందించింది లేదు.

మీ టూ ఇష్యూ సంచ‌ల‌నాల మీద సంచ‌నాలు సృష్టిస్తున్న వేళ‌.. దానిపై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌కుండా మౌనంగా ఉన్న ఆయ‌న‌.. తాజాగా ఒక ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌టం ద్వారా వార్త‌ల్లోకి వ‌చ్చేశారు. ఇంత‌కీ వ‌ర్మ పోస్ట్ చేసిన ఫోటో ఏమిటంటారా? ఏళ్ల‌కు ఏళ్లు గ‌డిచినా నేటికీ తెలుగోళ్లు తెగ అభిమానించే ఎన్టీవోడి రెండో పెళ్లి ఫోటోను ఆయ‌న పోస్ట్ చేశారు.

ఇందులో విశేషం ఏమిటంటారా? విశేషం లేకుండా ఉత్తినే ఫోటో పోస్ట్ చేస్తే.. ఆయ‌న వ‌ర్మ ఎందుకు అవుతారు? ఆయ‌న పోస్ట్ చేసిన ఫోటోలో స్వ‌ర్గీయ ఎన్టీఆర్.. ల‌క్ష్మీ పార్వ‌తిలు దండ‌లు మార్చుకున్న ఫోటో అది. వారితో పాటు ఆ ఫోటోలో మ‌రొక‌రున్నారు. వారెవ‌రో కారు.. ఎన్టీవోడి అల్లుడిగా.. త‌ర్వాతి కాలంలో మామ‌ను వెన్నుపోటు పొడిచిన అల్లుడిగా కీర్తి ప్ర‌తిష్ట‌ల‌ను సొంతం చేసుకున్న చంద్ర‌బాబు నాయుడు.

అయినా.. వ‌ర్మ ఇప్పుడీ ఫోటోను ఎందుకు షేర్ చేసుకున్నార‌న్న సందేహం వ‌చ్చిందా? అక్క‌డికే వ‌స్తున్నాం. ఉత్తినే ఏమీ చేయ‌డు.. చేసే ప్ర‌తి ప‌నిలోనూ ఏదో లెక్క ఉంటుందంటూ వ‌ర్మ గురించి చెప్పే వారి మాట‌ల‌కు త‌గ్గ‌ట్లే భారీ న్యూస్ తో స‌ద‌రు ఫోటోను షేర్ చేశాడు వ‌ర్మ‌. గ‌తంలో తాను తెర‌కెక్కిస్తానంటూ చెప్పిన ఎన్టీఆర్ బ‌యోపిక్ ముచ్చ‌ట‌ను మ‌రోసారి తెర మీద‌కు తెచ్చారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ బ‌యోపిక్ తీస్తాన‌ని గ‌తంలో చెప్పి కొంత హ‌డావుడి చేసి.. త‌ర్వాత కామ్ అయిన వ‌ర్మ తాజాగా మ‌రోసారి ఆ ప్రాజెక్టు డిటైల్స్ వెల్ల‌డించారు.

ద‌స‌రా రోజున ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ షూటింగ్ ప్రారంభిస్తాన‌ని.. జ‌న‌వ‌రి నెలాఖ‌రులో విడుద‌ల చేస్తాన‌ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు. అంతేకాదు.. ఈ బ‌యోపిక్ వివ‌రాల్ని ఈ నెల 19న తిరుమ‌తిలో రిలీజ్ చేస్తాన‌ని వెల్ల‌డించారు. అది కూడా ఒక ప్రెస్ నోట్లో. ఎప్ప‌టిలానే త‌న‌దైన శైలిలో పోస్ట్ పెట్టిన వ‌ర్మ‌.. తానీ సినిమా గురించి వెల్ల‌డించ‌టానికి చాలా థ్రిల్ ఫీల్ అయిన‌ట్లుగా చెప్ప‌టం చూస్తుంటే.. రానున్న నాలుగు నెల‌లు వ‌ర్మ సంచ‌ల‌నాలు వ‌రుస పెట్టి ఉండ‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.