Begin typing your search above and press return to search.

లక్ష్మీస్ ఎన్టీఆర్.. వర్మ ఓపెన్ అయిపోయాడు

By:  Tupaki Desk   |   10 Oct 2017 1:10 PM GMT
లక్ష్మీస్ ఎన్టీఆర్.. వర్మ ఓపెన్ అయిపోయాడు
X
తెలుగు రాజకీయాల్లో అప్పటివరకు ఉన్న కాంగ్రెస్ ని ఒక్కసారిగా తన ఎంట్రీతో ఓడించి ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలను మార్చి వేసిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ స్థాయి వారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఆయన చివరి రోజుల్లో ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయనేది అందరికి తెలిసిందే.. అయినా ఇంకా ఎదో తెలియనిది జరిగింది అనే అనుమానం అందరిలోను ఉంది. అయితే ఆయన చివరి రోజుల్లో జరిగిన ప్రధాన అంశాలను తాను చూపిస్తానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెబుతున్నాడు.

ఈరోజు ఈ సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టేసి ప్రకటించిన వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. అయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను మొదలు పెట్టి అదే ఏడాది అక్టోబర్ నెలలో ఎలాగైనా సినిమాను రిలీజ్ చేస్తాను. ఇక ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి రాకేష్ రెడ్డి. అతను వైసిపి నేత అని నాకు ముందు తెలియదు ఒక స్నేహితుడి ద్వారా పరిచయమైతే కథ చెప్పాను ఆయనకు నచ్చింది. తీద్దామని చెప్పిన తర్వాత అతను వైసిపి నేత అని తెలిసిందని వర్మ చెప్పాడు. అంతే కాకుండా ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో ఉండదని కేవలం 'లక్ష్మిస్ ఎన్టీఆర్' అనే కాన్సెప్ట్ చుట్టూ తీరుగుతుంది. అంటే లక్ష్మి పార్వతి వచ్చిన తర్వాత రామారావు గారి జీవితం ఎలాంటి మలుపులు తీరిగింది అనే అంశాలను మాత్రమే చూపిస్తానని చెప్పారు.

ఈ సినిమా తీస్తున్న వర్మకు వార్నింగ్ లు ఏమైనా వస్తాయా అని అడుగగా.. వర్మ ఈ విధంగా ఆన్సర్ ఇచ్చాడు. నేను 50 ఏళ్ల నుంచి చూస్తున్న సిగరెట్ ప్యాకెట్ మీద కూడా వార్నింగ్ ఉంది. దాన్ని ఎవరు పట్టించుకోరు. సో.. ఏం చేసినా ఒకరికి నచ్చవచ్చు.. మరొకరికి నచ్చకపోవచ్చు. నేను వాటి గురించి పట్టించుకోను. అయినా ఈ సినిమాను నేను ఒక రాజకీయాన్ని టార్గెట్ చేసి తీయడం లేదు. అలాగే ఎవరిని కించపరిచే ఉద్దేశ్యం లేదు. రామారావు గారి పై సినిమా తీసే హక్కు ఎవ్వరికైనా ఉంది. ఎవరికీ తోచినట్టుగా వారు తీసుకోవచ్చు. ఎవరి స్టైల్ వారిది. నేను కేవలం నా పాయింట్ ఆఫ్ వ్యూలో తీస్తున్నా.. అంటూ ఓపెన్ అయిపోయాడు వర్మ. ఇకపోతే ఇంకా ఎవ్వరి పాత్రలను ఫైనల్ చేయలేదని తెలిపాడు.