Begin typing your search above and press return to search.

నాకే తెలుసు.. కత్తితో పొడిచి చెబుతా

By:  Tupaki Desk   |   4 Dec 2016 4:42 AM GMT
నాకే తెలుసు.. కత్తితో పొడిచి చెబుతా
X

వంగవీటి అనే మూవీతో సెన్సేషన్స్ సృష్టించడానికి సిద్ధమైపోయాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ మూవీ అనౌన్స్ మెంట్ నుంచి.. ఇప్పటి ఆడియో ఫంక్షన్ వరకూ ప్రతీదీ సంచలనమే. సాధారణంగా వివాదం ఎక్కడుంటుందో.. అందులో వర్మకు సినిమా స్టోరీ కనిపిస్తుంటుంది. కానీ వంగవీటి చిత్రం తెరకెక్కించడం వెనక కారణం ఏంటో.. చాలా వివరంగా ఓ వీడియో రూపంలో చెప్పాడు వర్మ.

తాను పుట్టి పెరిగింది హైద్రాబాద్ లో అయినా.. నిజంగా పుట్టి పెరిగింది విజయవాడలోనే అంటున్నాడు వర్మ. 'ఎందుకంటే నాకు అవగాహన.. బంధాలు.. స్నేహాలు.. తెలివి.. ప్రేమించుకోవడాలు.. చంపుకోవడాలు నాకు తెలిసింది విజయవాడలోనే. రక్తచరిత్రకు.. వంగవీటికి ప్రధానమైన తేడా.. పగకు-ఆవేశానికి ఉన్న తేడా. ఫ్యాక్షనిస్ట్ శత్రువే ప్రపంచంగా బతుకుతాడు.. కానీ రౌడీ మాత్రం ప్రపంచమే శత్రువుగా బతుకుతాడు. చుట్టూ ఉన్న మనుషులు తనను మనిషిగా చూడనప్పుడే రౌడీగా మారతాడు' అంటూ రౌడీ పుట్టుక వెనక తనకున్న అవగాహన చెప్పాడు వర్మ.

'ఫ్యాక్షనిస్ట్ తను చచ్చినా శత్రువును చంపాలని అనుకుంటాడు. ఒక రౌడీ తను బతకడానికి మాత్రమే చంపుతాడు. హింసా చరిత్రలో.. ఫ్యాక్షనిస్ట్ వారధి అయితే.. రౌడీ ఒక మలుపు. ఫ్యాక్షనిజానికి బ్యాక్ గ్రౌండ్ వారసత్వం అయితే.. రౌడీయిజానికి వారసత్వం దమ్ము' అని చెప్పిన వర్మ.. ' రౌడీయజం రూపం 30 ఏళ్ల క్రితం విజయవాడ సిద్ధార్ధ ఇంజినీరింగ్ కాలేజ్ లో చదువుతున్నపుడు బాగా దగ్గరగా నా కళ్లతో నేనే స్వయంగా చూశా' అన్నాడు.

'విజయవాడ రౌడీయిజం గురించి నా కన్నా ఎక్కువ తెలిసిన వాడు ఎవడూ లేడని బల్ల గుద్ది మాత్రమే కాదు.. కత్తితో పొడిచి మరీ చెప్పగలను. వంగవీటి రాధాగారు చేసిన మొదటి హత్య నుంచి వంగవీటి రంగా గారి హత్య వరకూ జరిగిన కథే వంగవీటి' అంటూ.. ఈ మూవీ గురించి వివరించాడు వర్మ.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/