Begin typing your search above and press return to search.

వర్మని బెదిరించారటగా!??

By:  Tupaki Desk   |   3 Dec 2016 11:41 AM GMT
వర్మని బెదిరించారటగా!??
X
వంగవీటి సినిమాకి సమస్యలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కాంప్రమైజ్ కాక తప్పని పరిస్థితిలో చివరకు కమ్మకాపు పాటను వంగవీటి మూవీ నుంచి తొలగిస్తున్నట్లు చెప్పిన వర్మ.. ఒకవైపు కోర్టు కేసులతో పాటు మరోవైపు రిలీజ్ కోసం మరిన్ని ఇబ్బందులు పడుతున్నట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం వర్మ విజయవాడలో క్యాంప్ వేశాడు. ఇవాళ సాయంత్రం(డిసెంబర్ 3) జరగనున్న ఆడియో ఫంక్షన్ ఒకటి అయితే.. వంగవీటి ఫ్యామిలీ-కోనేరు సత్యనారాయణ-కొడాలి నాని సహా పలువురితో భేటీ కూడా నిర్వహించాడు. వంగవీటి మూవీపై వంగవీటి రాధాకృష్ణ కేసు వేయగా.. కమ్మకాపు పాట తీసేశాక కేసు ఓ కొలిక్కి వచ్చినట్లయింది. అయితే.. మరోసారి కేసు వేయరనేందుకు ఏం లేదు. అందుకే రిలీజ్ కి ఇబ్బంది రాకుండా ఒప్పందం కోసమే ఈ మీటింగ్ అని అర్ధం చేసుకోవచ్చు కానీ.. ఇది అంత సామరస్యపూర్వకంగా ఏం పూర్తి కాలేదని తెలుస్తోంది. ఇందుకు వర్మ మాటలే నిదర్శనం. ఏకంగా డేంజరస్ వార్నింగ్స్ అనే మాట వాడాడంటేనే.. ఈ బెదిరింపుల్లో ఉన్న ఇంటెన్సిటీ అర్ధమవుతుంది.

'నేను చాలా రకాల బెదిరింపులను చూశాను. కానీ మొదటిసారి నవ్వుతూనే వార్నింగ్ చూడాల్సి వచ్చింది. ఇది చాలా డేంజర్. అయినా సరే వంగవీటిపై నా వ్యూ లో మార్పు రాదు. ఇద్దరు ఇంపార్టెంట్ వ్యక్తులు సమస్యలు క్రియేట్ చేస్తున్నారు. అయితే వంగవీటి రాధారంగా మిత్ర మండలి నన్ను సపోర్ట్ చేస్తోంది. వారిని ఆడియో ఫంక్షన్ కి పిలిచా' అంటున్నాడు వర్మ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/