Begin typing your search above and press return to search.

చంపడం కాదు..నువ్వు చావరా...వర్మ

By:  Tupaki Desk   |   21 Sep 2018 1:25 PM GMT
చంపడం కాదు..నువ్వు చావరా...వర్మ
X
పరువు కోసం ప్రాణలైన ఇస్తాడు......ఇది పాత మాట - కాని ఇప్పుడు పరువు కోసం ప్రాణలైన తీస్తారు.....ప్రస్తుతం సమాజంలో ఈ తరహా పంథా నడుస్తోంది. గత వారం రోజులలో పరువు హత్యలు తెలుగు రా‌ష్ట్రాలను ఒక కుదుపు కుదిపాయి. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న అక్కసుతో తన అల్లుడైన ప్రణయ్‌ ను అతి కిరాతంగా చంపించేసిన మారుతిరావు - జైలుకు వెళ్లి పరువు నిలబెట్టుకున్నాడా.....?

ఎప్పుడూ వివాదస్పద వ్యాఖ్యలు చేసే దర్శకుడు రాంగోపాల వర్మ - ప్రణయ్ హత్యకు సంబంధించి తన ట్విటర్ ద్వారా స్పందించారు. పరువు కోసం మారుతిరావు తన అల్లుడిని చంపండం పరువు కాదని - పరువు కోసం తన ప్రాణ త్యాగానికైన సిద్దపడడంలోనే నిజమైన పరువు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో గడచిన కొంత కాలంగా పరువు హత్యలు కలకలం పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రలైన తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ - తెలంగాణలలో పరువు హత్యల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. నల్గోండ జిల్లా మిర్యాలగూడలో అగ్రవర్ణానికి చెందిన అమ్రుత వర్షిణి దళిత కులానికి చెందిన ప్రణయ్ వివాహం చేసుకోవడం తండ్రి మారుతీరావుకు నచ్చలేదు.

దీంతో కోట్లు ఖర్చు చేసైన తన అల్లుడిని అంతం చేయాలనుకున్నారు. అలాగే చేసాడు కూడా. ఈ హత్య జరిగిన రెండు రోజులకే హైదారాబాద్‌ లో ఇలాంటి ఘటనే జరిగి కలకలం స్రుష్టించింది. దీంతో రాజకీయ ప్రముఖులు - సినీ తారలు - వివిధ రంగాలలో ప్రముఖులు ట్విట్లతో విరుచుకుపడ్డారు. గత కొంత కాలంగా ట్విట్లకు - వివాదాలకు దూరంగా ఉన్న రాంగోపాల్ వర్మ ఈ ఘటనపై ఆలస్యంగా నైనా చాలా సీరియస్‌ గా స్పందించారు. పరువంటే పిల్లలను చంపుకోవడం కాదని, నీకు నువ్వే చావడమని ఘటూగా తిట్టారు. ఇటాంటి మనుషులకు సభ్యసమాజంలో బతికే అర్హత లేదన్నారు. నాలుగు రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు ఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపాయి. రాంగోపాల్ వర్మ కంటే ముందే తెలుగు సినీ హీరోలు మంచు మనోజ్ - నిఖిల్ సంఘటనను ఖండిస్తూ ట్విట్లు చేసారు. ఇక తెలంగాణ మంత్రి హరీష్‌ రావు పిల్లలు పెద్దవాళైన తర్వాత వారికి స్వేచ్ఛను ఇవ్వాలని ట్విట్ చేసారు. రెండు వేరువేరు కులాల వారు పెళ్లి చేసుకుంటే సమాజం వేడుక చేసుకోవాలన్నారు. ఇలా ప్రముఖులందరూ ఈ ఘటనను ఖండించారు. రాంగోపాల్ వర్మ ట్విట్ తర్వాత టాలీవుడ్ - బాలీవుడ్ నుంచి మరి కొందరూ ట్విట్టర్ ద్వార తమ అభిప్రాయాలు తెలియజేసే అవకాశం ఉంది.