Begin typing your search above and press return to search.

నేరాలు తప్ప ఇంకేం కనిపించవా!

By:  Tupaki Desk   |   25 Aug 2016 5:30 PM GMT
నేరాలు తప్ప ఇంకేం కనిపించవా!
X
మన దేశంలో క్రైమ్ కు ఎంత డిమాండ్ ఉంటుందో.. ప్రతీ రోజూ టీవీల్లో వస్తున్న క్రైమ్ బులెటిన్స్ చూస్తే అర్ధమైపోతుంది. కొన్ని లీడింగ్ ఛానల్స్ అయితే.. అదేదో మహాద్భుతం అన్నట్లుగా.. కేరక్టర్ ఆర్టిస్టులను పెట్టి షార్ట్ ఫిలిమ్స్ రేంజ్ లో తీసేసి మరీ ఈ ఘోరాలను టెలికాస్ట్ చేసేస్తున్నారు. ఇవి చాలవన్నట్లు సెన్సేషన్స్ తోనే సావాసం చేస్తాననే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లు అయితే.. క్రైమ్ జరిగితే చాలు సినిమా అనేస్తున్నారు.

నయీమ్ ఘోర నేర చరిత్రపై ఓ ట్రయాలజీ తీస్తానని ఇప్పటికే చెప్పాడు వర్మ. దేశంలో ఎక్కడ పేద్ద నేరం జరిగితే అక్కడ ఈయన సినిమా ఉంటుంది వాలకం. ముంబై దాడులపై ది అటాక్స్ ఆఫ్ 26/11.. కర్నాటకలో కిల్లింగ్ వీరప్పన్.. తెలుగులో రక్త చరిత్ర.. బెజవాడ(నిర్మాత).. ఇప్పుడు వంగవీటి ఈయన చిత్ర రాజాలు. ఇప్పుడు నయీమ్ పై ట్రయాలజీ అంటున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో ఇలాంటివి చాలానే ఉంటాయి. ఆయా నేరాల తీవ్రత చెప్పడం కరెక్టే కానీ.. ఆ కరడు కట్టిన నేరస్తుల పైనే సినిమాలు తీయడం ఎందుకో అర్ధం కాని విషయం.

ఇలాంటి ప్రశ్నలు వేస్తే.. జనాలు చూస్తున్నారు కాబట్టి తీస్తున్నామనే సమాధానం రెగ్యులర్ గా వచ్చేదే. కానీ సమాజాన్ని ముప్పతిప్పలు పెట్టిన పాత్రలను హీరోలుగా చేసి చూపించడంలో వర్మ కానీ.. ఇలాంటి సినిమాలు తీసేవాళ్ల ఆంతర్యం ఏంటో అర్ధం కాని విషయమే.