Begin typing your search above and press return to search.

ఆ బార్‌ లో ఆర్జేవీ కాక్ టెయిల్‌

By:  Tupaki Desk   |   26 Nov 2015 1:30 PM GMT
ఆ బార్‌ లో ఆర్జేవీ కాక్ టెయిల్‌
X
విష‌యం ఏదైనా కానీ.. తాను కానీ రియాక్ట్ కావాల‌నుకుంటే ఎలాంటి మొహ‌మాటం లేకుండా ట్వీట్ ల‌తో చెల‌రేగిపోయే చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖుడు.. ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌. అవ‌స‌ర‌మైన అంశాల‌కే కాదు.. అన‌వ‌స‌ర అంశాల‌కు సైతం ట్వీట్ల చేయ‌టం ఆయ‌న‌కే చెల్లింది. తాను చేసే ట్వీట్ల‌తో నిత్యం వార్త‌ల్లో న‌లిగే వ‌ర్మ‌కు.. హైద‌రాబాద్ కు చెందిన ఓ ఖ‌రీదైన బార్ చిత్ర‌మైన అనుభూతిని మిగిల్చింది.

సాధార‌ణంగా వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖ‌ల పేరు మీద ఏదో ఒక డిష్ ను త‌యారు చేసి మెనూలో పెడుతుంటారు. చిత్ర‌మైన మైండ్ సెట్ తో ఉండే వ‌ర్మ పేరు మీద న‌గ‌రానికి చెందిన‌ కాక్‌ టెయిల్స్ లాంజ్ ఒక కాక్ టెయిల్ ను సిద్ధం చేసి.. స‌ర్వ్ చేసింది. ఆర్జీవీ ఎల్స్‌ర్ (ఆర్జీవీ అమృతం) పేరుతో లాంఛ్ చేశారు. ర‌మ్‌.. జిన్‌.. వోడ్కా మిశ్రమంతో దీన్ని సిద్ధం చేసిన‌ట్లు చెబుతున్నారు.

త‌న పేరు మీద రూపొందించిన కాక్ టెయిల్ లాంఛ్ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన రాంగోపాల్ వ‌ర్మ సంద‌డి.. సంద‌డి చేశారు. ఫిఫ్టీ ట‌చ్ అయినా కుర్ర పోక‌డ‌లు త‌గ్గ‌ని వ‌ర్మ స‌ర‌దాగా గ‌డ‌ప‌ట‌మే కాదు.. అమ్మాయిల‌తో క‌లిసి చిందేయ‌టం ప్ర‌ధానాక‌ర్ష‌ణగా మారింది. సంద‌డి.. సంద‌డిగా సాగిన ఈ లాంఛింగ్ కార్య‌క్ర‌మం చూస్తే.. వ‌ర్మ ఫిఫ్టీలో ఉన్నారంటే న‌మ్మ‌లేని ప‌రిస్థితి.