Begin typing your search above and press return to search.

అదే నా చివ‌రి చిత్రం అంటున్న వ‌ర్మ‌

By:  Tupaki Desk   |   10 Feb 2016 9:30 AM GMT
అదే నా చివ‌రి చిత్రం అంటున్న వ‌ర్మ‌
X
రామ్‌ గోపాల్ వ‌ర్మ చాలా మాట్లాడ‌తాడు. అన్నీ మాట్లాడేశాక నేను మాట మీద నిల‌బ‌డ‌ను అంటుంటాడు. అందుకే ఆయ‌న చెప్పే మాటల్ని సీరియ‌స్‌ గా తీసుకోవాలో లేక లైట్‌ గా తీసుకోవాలో అర్థం కాక జ‌నాలు త‌ల‌కిందుల‌వుతుంటారు. వ‌ర్మ ఎప్పుడూ ఏదో ఒక‌టి మాట్లాడేస్తుంటాడ్లే అని మ‌నం నిజంగా లైట్‌ గా తీసుకొన్నామంటే అది త‌ప్ప‌ని నిరూపిస్తూ ఏదో ఒక సంచల‌నానికి తెర తీస్తుంటాడు. అందుకే ఆర్జీవీ అంటే ఎవ్వ‌రికీ అర్థం కాని ఓ జీవి అంటుటారంతా. అయితే తాజాగా ఆయ‌న మ‌రో సంచ‌ల‌న విష‌యం ప్ర‌క‌టించాడు. ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ``నేను చేసే ఆఖ‌రి ఫీచ‌ర్ ఫిల్మ్ ఇదే`` అని ప్ర‌క‌టించాడు. సినిమా లేక‌పోతే బ‌త‌క‌లేడేమో అనిపించే వ‌ర్మ ఉన్న‌ట్టుండి దే నా చివ‌రి చిత్రం అన‌డ‌మేంటి అని అంతా ఇప్పుడు ఆరా తీస్తున్నారు. చివ‌రి ఫీచ‌ర్ ఫిల్మ్ అంటున్నాడు కాబ‌ట్టి.. వేరే ర‌క‌మైన సినిమాలు మాత్రం చేస్తుంటాడ‌ని అర్థం చేసుకోవ‌చ్చు. అంటే యూ ట్యూబ్‌ లో వ‌చ్చే షార్ట్ ఫిల్మ్స్ త‌ర‌హాలో అన్న‌మాట‌. ఆ విష‌యాన్ని కాసేపు పక్క‌న‌పెట్టి వ‌ర్మ చివ‌రి చిత్రం ఏది అవుతుంద‌న్న పాయింట్‌ కి వ‌ద్దాం.

వ‌ర్మ ఇటీవ‌ల విజ‌య‌వాడ రాజ‌కీయాల నేప‌థ్యంలో వంగవీటి పేరుతో ఓ చిత్రం తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేశాడు. వంగ‌వీటి రంగా హ‌త్య నేప‌థ్యంలోనూ, త‌న‌ద‌నంత‌ర రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలోనూ ఆ చిత్రం తెర‌కెక్కించాల‌నేది వ‌ర్మ ఆలోచ‌న‌. అయితే ఆ ప్ర‌య‌త్నాన్ని రాజ‌కీయ వ‌ర్గాలు అడ్డుకుంటున్నాయి. మా ఇమేజ్‌ కి డ్యామేజ్ అయితే ఇబ్బందులు ఎదుర్కోవ‌ల్సి వ‌స్తుంద‌ని ఇరు వ‌ర్గాలు వ‌ర్మ‌ని హెచ్చ‌రిస్తున్నాయి. కానీ వ‌ర్మ మాత్రం ఆ హెచ్చ‌రిక‌ల‌కి భ‌య‌ప‌డ‌కుండా సినిమాని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు. ప్ర‌స్తుతం వ‌ర్మ హిందీలో ఓసినిమా చేస్తున్నాడు. ఆ చిత్రం పూర్త‌వ్వ‌గానే మ‌ళ్లీ తెలుగులోకి వ‌చ్చి వంగవీటి చిత్రాన్ని మొద‌లుపెడ‌తాడు. ఆ సినిమా స‌త్య త‌ర‌హాలో ఓ ఎమోష‌న‌ల్ చిత్రంగా ఉంటుంద‌ని చెప్పుకొచ్చాడు వ‌ర్మ‌.