Begin typing your search above and press return to search.

తుపాకులు-తొడలు.. పోస్టర్ బాగుంది కానీ..

By:  Tupaki Desk   |   29 May 2017 9:43 AM GMT
తుపాకులు-తొడలు.. పోస్టర్ బాగుంది కానీ..
X
రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో తుపాకులు మరియు తొడలు(గన్స్ అండ్ థైస్)కు బోలెడంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పటికే ఇదే పేరుతో తన బయోపిక్ లాంటి ఓ పుస్తకం కూడా రాసేశాడు వర్మ. ఇప్పుడు ముంబై మాఫియాను తన కోణంలోంచి ఒరిజినల్ గా చూపిస్తానంటూ వెబ్ సిరీస్ తీసేస్తున్నాడు.

తాజాగా ట్విట్టర్ వదిలేసి ఇన్ స్టాగ్రామ్ లో చేరిన వర్మ.. రీసెంట్ గా గన్స్ అండ్ థైస్ అంటూ డిజైన్ చేసిన ఓ పోస్టర్ ను రిలీజ్ చేశాడు. నాలుగు రివాల్వర్స్ ను నాలుగు మూలలకు ఫోకస్ చేస్తూ.. నలుగురు అమ్మాయిల కాళ్ల వరకూ నాలుగు దిక్కులకు ఉండేలా డిజైన్ చేసిన ఈ పోస్టర్ చూసేందుకు బాగానే ఉంది. గభాలున చూస్తే.. గన్స్ అండ్ థైస్ పోస్టర్ అదిరిందిగా అనిపించేయడం ఖాయం. అది కూడా వర్మ ఇన్ స్టాగ్రామ్ లో పేజ్ కనిపించడంలో అలా అనేసుకోవడంలో తప్పేమీ లేదు. అయితే.. ఇది కేవలం ఫ్యాన్ మేడ్ పోస్టర్ మాత్రమే. ఆ విషయాన్ని తనే చెప్పాడు వర్మ.

'ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఇది. ఇది గన్స్ అండ్ థైస్ వెబ్ సిరీస్ కు సంబంధించిన మూడ్ కు కానీ.. కాన్సెప్ట్ కు కానీ దగ్గరగా లేకపోయినా.. ప్రయత్నాన్ని మాత్రం అభినందిస్తున్నా' అంటూ ఈ పోస్టర్ కు కామెంట్ చేశాడు వర్మ. ఫ్యాన్ మేడ్ పోస్టరే ఇంత క్రియేటివ్ గా ఉంటే.. ఇక వర్మ వీటన్నిటి నుంచి స్ఫూర్తి తీసుకుని డిజైన్ చేయించే పోస్టర్ ఎలా ఉంటుందో!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/