Begin typing your search above and press return to search.

ఆడు పై సంజాయిషీ ఇచ్చిన ఆర్జీవీ!

By:  Tupaki Desk   |   18 April 2019 5:02 PM GMT
ఆడు పై సంజాయిషీ ఇచ్చిన ఆర్జీవీ!
X
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిన్నమొన్నటిదాకా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు తన ఫోకస్ కేసీఆర్ బయోపిక్ పైకి షిఫ్ట్ చేశాడు. 'టైగర్ కేసీఆర్' పేరుతో 'ది అగ్రెసివ్ గాంధీ' క్యాప్షన్ తో ఫస్ట్ లుక్ ను గురువారం నాడు విడుదల చేశాడు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో 'ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు' అనే ఒక కొటేషన్ కూడా ఇచ్చాడు. జస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే వర్మ అందరినీ తనవైపుకు తిప్పుకున్నాడు. దాంతో పాటుగా కేసీఆర్ ను 'ఆడు' అని సంభోదించడంపై వివాదం కూడా మొదలైంది.

'ఆడు' అనే పదంతో కేసీఆర్ ను రిఫర్ చేయడంపై కేసీఆర్ అభిమానులు కొందరు వర్మపై మండిపడుతున్నారు. దీంతో ఆర్జీవీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా 'ఆడు'అనే పదం వాడడం పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. "ట్యాగ్ లైన్ లో ఉన్న 'ఆడు' అనే పదం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారికి నేను చెప్పేది ఒకటే... తెలంగాణ సాధించక ముందు కేసీఆర్‌ను చిన్నచూపు చూసిన కొందరి దృష్టిలో అలాంటి పదం వాడడం జరిగింది. ఆ లైన్లో ఎంత డెప్త్ ఉందో కేసీఆర్.. కేటీఆర్ అర్థం చేసుకుంటారని నాకు నమ్మకం ఉంది." అంటూ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ కు నెటిజనుల నుండి మిశ్రమ స్పందన దక్కింది. ఒక నెటిజనుడు "ఏంటిది.. కొత్తగా సంజాయిషీ ఇస్తున్నావు.. బొత్తిగా మారిపోయావు వర్మా" అన్నాడు. మరో వ్యక్తి కామెంట్ చేస్తూ " నేను ఆ డెప్త్ అర్థం చేసుకున్నా. ఆడు అనేది అగౌరవమైన పదం కాదు. ఆ పదంలో మాస్ పీపుల్ మాత్రమే అర్థం చేసుకుంటారు. ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చే సమయంలో దాన్ని వాడతారు. ఉదాహరణకు 'ఆడు గొప్పోడురా' అంటాం కదా" అని మరో నెటిజనుడు అభిప్రాయపడ్డాడు. ఒకరు మాత్రం "కేసీఆర్ తో జాగ్రత్త.. ఎక్కువ తక్కువ చేస్తే తోలు వలుస్తాడు" అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అయినా మనపిచ్చిగానీ వర్మ మైండ్ లో ఫిక్స్ అయ్యాక బ్లైండ్ గా వెళ్ళిపోతాడు. ఎవరు ఎన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసినా ఉపయోగం లేదు.