అబ్బే ఆయన ఎన్టీఆర్ కాదు

Wed Oct 11 2017 14:39:21 GMT+0530 (IST)

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు అంటే దాన్ని రిలీజ్ చేస్తాడా లేదా అనే విషయం సినిమా రిలీజ్ అయ్యేవరకు ఎవ్వరు ఊహించలేరు. ఇక ఆయన సినిమా అనౌన్స్ చేస్తే చాలు మీడియాలో ఎదో ఒక న్యూస్ హల్ చల్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆయన తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి కూడా ఎదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. అలాగే రూమర్స్ కూడా చాలానే వస్తున్నాయి.కానీ వర్మ ఆ రూమర్స్ కి ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే ఉన్నాడు వర్మ. తన వరకు ఏ వార్త వచ్చినా సింపుల్ గా ఫెస్ బుక్ కామెంట్స్ తో క్లారిటీ ఇస్తున్నాడు. ఇటీవల లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు ప్రకాష్ రాజ్ ని సెలెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతే కాకుండా అయన అయితేనే ఆ పాత్రకు సరైన న్యాయం చేయగలరని కామెంట్స్ ఓ రేంజ్ లో వినిపించాయి. అయితే వర్మ ఎప్పటిలానే ఆ రూమర్స్ కి చెక్ పెట్టాడు. సినిమాలో ప్రకాష్ రాజ్ - ఎన్టీఆర్ లా కనిపించనున్నారని వస్తున్న వార్తలు పూర్తి అవాస్తమని ఇంకా ఫైనల్ గా ఎవరిని డిసైడ్ చేయలేదని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.

'లక్ష్మిస్ ఎన్టీఆర్' సినిమా గురించి వర్మ ఏ సినిమాకు తీసుకొని విధంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమాపై ఏ తరహా రూమర్స్ రాకూడదని క్లారిటీ ఇస్తున్నాడు. ఇంతకుముందు కూడా నటుడు జేడీ.చక్రవర్తి సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు వచ్చిన రూమర్స్ కి ఇదే తరహాలో సమాధానం ఇచ్చాడు.