Begin typing your search above and press return to search.

బాహుబలితో బేఫికర్ కి కంపారిజన్!!

By:  Tupaki Desk   |   23 Oct 2016 4:22 AM GMT
బాహుబలితో బేఫికర్ కి కంపారిజన్!!
X
ఇండియన్ హిస్టరీలో నిలిచిపోయే బాహుబలికి.. లిప్ లాక్ లు చేసుకుంటూ ఇంటిమేట్ సీన్స్ తో థియేటర్లకు పిలుస్తున్న బాలీవుడ్ మూవీ బేఫికర్ కి పోలిక పెట్టే ధైర్యం ఎవరూ చేయరు. కానీ ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు వచ్చే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒక్కడే. బాహుబలి2 ఫస్ట్ లుక్ లాంఛ్ అయిన తర్వాత.. బేఫికర్ మూవీని ఉద్దేశించి వర్మ వరుస ట్వీట్స్ తో చంపేశాడు.

'కేవలం డైరెక్టర్ గానే చెబుతున్నా.. బేఫికర్ మూవీ బాహుబలిలో ఒక్క షాట్ లో సగానికి కూడా సమానం కాదు. ఆదిత్య చోప్రా సినిమాలో తీసుకున్న పాయింట్ గురించి కాదు.. దాన్ని చూపించిన విధానం గురించే మాట్లాడుతున్నా. ఆదిత్య చోప్రా.. రణవీర్ సింగ్ ల కాంబినేషన్ కంటే వేరే ఏదీ పెద్దకి కాదు. కానీ వాళ్లిద్దరూ కలిసి బాహుబలిలో వెయ్యోవంతు సినిమా తీయడమే నాకు బాధ కలిగించింది. ఒకవేళ ఆది పేరును.. రణవీర్ ఫేస్ ని తీసేస్తే.. వారం వారం వచ్చిపడే టీనేజ్ రొమాంటిక్ కామెడీలకి దీనికి తేడా ఏమీ లేదు' అంటూ ట్వీట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.

'ఆగ్ లాంటి సినిమా తీసిన దర్శకుడిగా.. నేను సలహాలిచ్చే అర్హత కోల్పోయానని తెలుసు. అయితే.. భారతీయ సినిమాని ఎస్ఎస్ రాజమౌళి తీసుకెళ్లిన స్థాయి కంటే ముందుకు.. ఆదిత్య చోప్రా తీసుకెళ్లాలని కోరుతున్నా' అంటూ వర్మ ట్వీట్ చేయడం.. కచ్చితంగా ఆ సినిమాపై ప్రభావం చూపేదే

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/