'యాత్ర'పై వర్మ కామెంట్స్

Tue Feb 12 2019 22:48:29 GMT+0530 (IST)

ప్రస్తుతం నందమూరి తారక రామారావు బయోపిక్ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్న రామ్ గోపాల్ వర్మ తాజాగా విడుదలైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ 'యాత్ర' గురించి స్పందించడం లేదే అంటూ చాలా మంది నిరుత్సాహంగా ఉన్నారు. వర్మ ఎప్పుడెప్పుడు ఈ చిత్రం గురించి స్పందిస్తాడా అంటూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు వర్మ 'యాత్ర' గురించి స్పందించాడు. 'యాత్ర' చిత్రంపై ప్రశంసలు కురిపించాడు. యాత్ర చిత్రం చాలా బాగా వచ్చిందంటూ వర్మ కామెంట్ చేశాడు.వర్మ ట్విట్టర్ లో... 'యాత్ర' ఒక అద్బుతమైన చిత్రం ఒక గొప్ప నాయకుడి సినిమాను చాలా గొప్పగా చూపించారు. దర్శకుడు మహి వి రాఘవ మరోసారి వైఎస్ ఆర్ ను ప్రేక్షకుల ముందుకు సజీవంగా తీసుకు వచ్చే ప్రయత్నం చేసి సఫలం అయ్యారు. ఆయనకు అభినందనలు ఇక మమ్ముటీ గారు అద్బుతంగా నటించారు అంటూ వర్మ పేర్కొన్నాడు. 'యాత్ర' సినిమాకు కేవలం వర్మ నుండే కాకుండా ఇంకా సినీ ప్రముఖులు మరియు ప్రేక్షకుల నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

అన్ని ఏరియాల్లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతూ దూసుకు పోతుంది. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ ను సాధిస్తుందనే నమ్మకంను ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. థియేట్రికల్ కలెక్షన్స్ ద్వారానే కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు శాటిలైట్ రైట్స్ ద్వారా కూడా యాత్ర భారీగానే రాబడుతున్నట్లుగా తెలుస్తోంది. జనాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంను 'యాత్ర' చిత్రం తట్టి లేపే విధంగా ఉంది.