రాజమౌళి-తారక్-చరణ్ ఫొటోపై వర్మ కామెంట్

Sun Nov 19 2017 11:32:52 GMT+0530 (IST)

ఏ ఇష్యూ మీద అయినా అంచనాలకు అందని విధంగా కామెంట్ చేయాలంటే రామ్ గోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా. నిన్న రాత్రి నుంచి ప్రకంపనలు రేపుతున్న రాజమౌళి-జూనియర్ ఎన్టీఆర్-చరణ్ ఫొటో గురించి అందరూ ఒక రకంగా కామెంట్ చేస్తుంటే.. వర్మ మాత్రం తన రూటే వేరని చాటుకున్నాడు. ఆయన ఆ ఫొటో గురించి పెట్టిన తేడా మెసేజులు జనాలకు షాకిస్తున్నాయి. ఇంతకీ ఈ ఫొటోపై వర్మ కామెంట్లు ఏమంటే..‘‘మహిళల్ని ఆరాధించే వాడిగా స్వలింగ సంపర్కుల సంస్కృతికి ఇలా ప్రచారం కల్పించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గుు ఆ టైపేనా? పైన ముగ్గురు కూడా పెళ్లయిన వాళ్లు.. అల్లా ఏం జరుగుతోంది? జీసస్ నాక్కొంచెం చెప్పవా..? బాలాజీ గారూ మీరైనా చెప్పండి’’ అని తనదైన శైలిలో వర్మ కామెంట్ చేశాడు ఈ ఫొటో గురించి.

వర్మ అంతే మరి. తాను ఏం మాట్లాడినా షాకింగ్ గా ఉండాలనే భావిస్తాడు. కొన్నిసార్లు తనకు నచ్చిన వాళ్లను హద్దుల్లేకుండా పొగిడేస్తాడు. కొన్నిసార్లు ఇలా గిల్లుతాడు. ఈ మ్యాజికల్ కాంబినేషన్ గురించి అతిశయోక్తి మాటలు మాట్లాడతాడని అనుకుంటాం కానీ.. వర్మ మాత్రం ఇలా ఎవ్వరూ ఊహించని విషయంలో కామెంట్ చేశాడు. ఐతే ఆయన తమాషాకే ఆ కామెంట్ చేశాడని అందరికీ తెలుసు కాబట్టి లైట్ తీసుకోవాల్సిందే.