Begin typing your search above and press return to search.

పవన్ ని చక్రవర్తితో పోల్చిన వర్మ

By:  Tupaki Desk   |   26 March 2017 6:31 AM GMT
పవన్ ని చక్రవర్తితో పోల్చిన వర్మ
X
సెన్సేషనల్ ట్వీటర్ రాం గోపాల్ వర్మ.. మెగా మూవీస్ రిలీజ్ అయినప్పుడు బాగా యాక్టివ్ అయిపోతుంటాడు. రకరకాల పోలికలతో ట్వీట్స్ పెడుతూ జనాల అటెన్షన్ బాగానే పట్టేస్తాడు. సర్దార్ డిస్ట్రిబ్యూటర్లను పవన్ ఆదుకోవడం లేదంటూ.. సినిమా రంగంలో ఒకే దేవుడు రజినీ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు.

అఫ్ కోర్స్.. కొచ్చాడయాన్.. లింగ సినిమాల తమిళ డిస్ట్రిబ్యూటర్లకు అంతో ఇంతో న్యాయం జరిగినా.. తెలుగు వెర్షన్ కొన్నవాళ్లు రోడ్డున పడ్డ సంగతి మర్చిపోయిన వర్మ.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను నీరో చక్రవర్తితో పోల్చాడు. ప్రస్తుతం పవన్ తన కుమార్తెల పుట్టిన రోజు వేడుకల్లో ఉన్న సంగతి ఫోటోల ద్వారా వెల్లడవుతోంది. దీన్ని కాటమరాయుడికి లింక్ చేసిన వర్మ.. '30 కోట్ల రూపాయలతో సినిమా తీసి.. 100 కోట్లకు అమ్మేసి.. 70 కోట్లు జేబులో వేసుకుని.. కూతుళ్ల పుట్టిన రోజు వేడుకల్లో ఎంజాయ్ చేయడం అంటే.. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించుకున్న నీరో కంటే తక్కువేమీ కాదు' అన్నాడు వర్మ.

ఇదేమీ కొత్త పోలిక కాదు కానీ.. టైమింగ్ కరెక్ట్ గా సెట్ అయిందని చెప్పాలి. అక్కడితో ఏమీ ఆగిపోలేదు వర్మ. ఇద్దరు పెళ్లాలతో కలిసి కూతుళ్ల బర్త్ డే పార్టీ ఎంజాయ్ చేస్తున్నాడంటూ.. ఇన్ డైరెక్టుగా కూడా పంచ్ లు వేశాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/