Begin typing your search above and press return to search.

జ‌య‌మాలిని నంది పాట‌తో వ‌ర్మ కౌంట‌ర్‌

By:  Tupaki Desk   |   17 Nov 2017 5:41 PM GMT
జ‌య‌మాలిని నంది పాట‌తో వ‌ర్మ కౌంట‌ర్‌
X
అస‌లే వ‌ర్మ‌. ఆపైన నందుల వివాదం. మామూలుగానే ఏదైనా జ‌రిగినంత‌నే రియాక్ట్ అయ్యే వ‌ర్మ ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నంది అవార్డుల మీదా రియాక్ట్ అయ్యారు. ఆయ‌న చేసిన వ్యంగ్య వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు మ‌ద్దినేని ర‌మేశ్‌. ఇప్ప‌టివ‌ర‌కూ ఎదురుకాని రీతిలో బూతుల‌తో భారీగా తిట్టేశారు మ‌ద్దినేని. విమ‌ర్శ‌లు.. పంచ్ ల విష‌యంలో ఎప్పుడూ త‌నదే పైచేయిగా ఉండే వ‌ర్మ‌కు మ‌ద్దినేని చేసిన పోస్టు స‌రికొత్త అనుభ‌వంగా చెప్పాలి.

అందుకేనేమో.. త‌న‌ను తెగ తిట్టి.. ఏకిపారేసినందుకు ప్ర‌తిగా అన్న‌ట్లు భారీ రిటార్ట్ ప్లాన్ చేశారు. ఒక పాట‌ను త‌యారు చేసి.. దాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసేశారు. అప్పుడెప్పుడో వ‌చ్చిన ఒక సినిమాలో జ‌య‌మాలిని పాట‌ను తీసుకొని.. ఆ లిరిక్ కు తాజా నందుల పంచాయితీ నేప‌థ్యంలో వెర్ష‌న్ మార్చేసి క‌మ్మ‌.. క‌మ్మ‌గా అంటూ శ్లేష‌ల‌తో త‌న‌దైన శైలిలో పాట‌ను పోస్ట్ చేశారు వ‌ర్మ‌. త‌న‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అన్న‌ట్లుగా పాటను పోస్ట్ చేశారు.

మ‌రీ.. పాట‌కు టెక్ట్స్ రూపంలో చూస్తే.. విష‌యం ఎంత ఘాటుగా ఉందో అర్థ‌మ‌వుతుంది.

నంది పాట‌

తారాగణం:-

నంది: జయమాలిని

కమిటీ సభ్యులుగా: రాజబాబు, పద్మనాభం, రావు గోపాల రావు తదితరులు


‘‘ఒకటా రెండా తొమ్మిది.. మరి ఒకటే నేను నందిని
ఒకటా రెండా తొమ్మిది.. మరి ఒకటే నేను నందిని
ఎవరికి ఇవ్వాలి అవార్డు.. ఇక ఊపండి బాబు గిచ్చుడు..
అంకెలు చూస్తే తొమ్మిది.. మా కోరిక మాత్రం ‘కమ్మ’ది, మా కోరిక మాత్రం ‘కమ్మ’ది
ఎహే..వేయకే నీవు రంకెలు.. నీ కన్నా గొప్పది సైకిలు, నీ కన్నా గొప్పది సైకిలు
గంగిరెద్దు లాగనన్ను చిన్నచూపు చూడకండి.. ఆ.. ఆ.. అమ్మోయ్..
గానుగెద్దు లాగనన్ను అక్కడక్కడే తిప్పకండి.. అబ్బ.. అబ్బ.. అబ్బో..
అహ్.. తట్టుకోలేను మీ విసురు... తగులుతుందయ్యో నా ఉసురు.. అయ్.. అయ్..
అహ్.. తట్టుకోలేను మీ విసురు... తగులుతుందయ్యో నా ఉసురు..
అడ్డువచ్చువాడు లేడు మాకు... పచ్చ జెండా ఊపుతాము మేము, పెద్ద పచ్చజెండా ఊపుతాము మేము
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ..
ఒకటా రెండా తొమ్మిది.. మరి ఒకటే నేను నందిని.. అయ్యో ఒకటే నేను నందిని..
సామి భక్తి కోసమేనా... ఇంత పెద్ద నంది కష్టం..
ఇష్టంవచ్చి నట్టుమీరు పంచుకోవడం మాకు ఇష్టం.. అబ్బ.. అబ్బ.. అబ్బబ్బ..
మాకు ఉన్న నొప్పులేవో మావీ.. మేము చెప్పినట్టు తల ఊపు నంది
ఇంకెందుకయ్యో ఈ నందులు.. ఎందుకో ఈ పిచ్చి చిందులు.. అబ్బ ఎందుకో ఈ పిచ్చి చిందులు..
అంకెలు చూస్తే తొమ్మిది.. మా కోరిక మాత్రం ‘కమ్మ’ది, మా కోరిక మాత్రం ‘కమ్మ’ది
‘కమ్మ’ది.. ‘కమ్మ’ది.. ‘కమ్మ’ది.. యాహ్..’’