Begin typing your search above and press return to search.

చిరు సుప్రీం..హ్యాండ్సమ్..వర్మని నమ్మొచ్చా

By:  Tupaki Desk   |   18 Jan 2017 11:56 AM GMT
చిరు సుప్రీం..హ్యాండ్సమ్..వర్మని నమ్మొచ్చా
X
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో.. రామ్ గోపాల్ వర్మపై నాగబాబు చేసిన వ్యాఖ్యల తర్వాత చాలానే రచ్చ జరిగింది. మామూలుగానే మెగా అంటేనే ఏదో ఒక విమర్శ చేసే వర్మ.. నాగబాబు కామెంట్స్ తర్వాత మరింతగా రెచ్చిపోయాడు.

బాలయ్య మూవీతో పోల్చుతూ ఖైదీ నంబర్ 150ని తక్కువ చేస్తూ చాలానే హంగామా చేశాడు. సడెన్ గా వర్మలో మార్పు వచ్చేసింది. ఖైదీ నంబర్ 150 చూసి.. మళ్లీ కొత్త యాంగిల్ లో మెగాస్టార్ ని పొగుడుతూ ట్వీట్స్ పెట్టేశాడు. 'ఇప్పుడే 150 చూశా. మెగా మెగా మెగా ఫెంటాస్టిక్ కంటే మెగాస్టార్ చాలా అద్భుతంగా ఉన్నారు. 150 మిలియన్ల ఛీర్స్ చెబుతున్నా. ఎనర్జీ లెవెల్స్ లో మెగాస్టార్ సుప్రీమ్ అంతే. 9 ఏళ్ల క్రితం ఇండస్ట్రీ వదిలేసి వెళ్లినప్పటికంటే ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నారు. మెగా హ్యాండ్సమ్ గా ఆయన కనిపిస్తున్నారు' అని ట్వీట్ చేశాడు వర్మ.

ఈ దర్శకుడు ఇలా రివర్స్ అయిపోవడంలో వింతేమీ లేదు కానీ.. అసలు పాయింట్ ఏంటంటే.. ఈ మాట మీద ఎన్ని రోజుల పాటు కాదు.. ఎన్ని గంటలపాటు నిలబడతాడనేదే చూడాలి. అంతలోనే అకౌంట్ హ్యాక్ అయిందనో.. ఆ ట్వీట్స్ నేను పెట్టలేదనో.. ఇంకోటో.. ఏదో ఒకటి చెప్పేసి మళ్లీ మార్చేయడం వర్మకు.. ట్వీట్ పెట్టినంత తేలికైన పని కదా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/