Begin typing your search above and press return to search.

వర్మ ఎగతాళి నిజమయ్యిందిగా!

By:  Tupaki Desk   |   23 May 2019 6:54 AM GMT
వర్మ ఎగతాళి నిజమయ్యిందిగా!
X
ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కొత్త చరిత్ర సృష్టించే దిశగా దూసుకెళ్తున్నాయి. తమ నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడబోతున్న ఆనందం వైసిపి శ్రేణుల్లో ఉండటం సహజమే కాని వారితో సమానంగా ఇంకా చెప్పాలంటే వారి కన్నా ఎక్కువ సంతోషించే వ్యక్తిగా రామ్ గోపాల్ వర్మను చెప్పొచ్చు. ఇప్పటికే పంచరైన సైకిల్ ముందు బాబు బేలగా కూర్చుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన వ్యంగ్యాస్త్రాలు మొదలుపెట్టిన వర్మ ఇంకో రెండు మూడు రోజుల దాకా ఇదే పోకడ కొనసాగిస్తాడు. అందులో అనుమానం లేదు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల విషయంలో వర్మ ఎదురుకున్న ఇబ్బందులు ఆఖరికి ఏపిలో రిలీజ్ చేయకుండానే దాని మీద ఆశలు వదిలేసుకున్న వైనం అందరికి గుర్తే.ఇప్పుడు వర్మ ఇంత ఆనందంగా ఉండడానికి ఇదే కారణం. ముందు నుంచి వెన్నుపోటు గురించి బాబు రెండు ముఖాల పోకడ గురించి పదే పదే ప్రస్తవిస్తూ వచ్చిన వర్మ కమర్షియల్ గా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని సేఫ్ ప్రాజెక్ట్ గా మలుచుకున్నాడు.

ఎన్టీఆర్ బయోపిక్ తీసిన బాలయ్య చేదు ఫలితం అందుకోగా టిడిపి వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ దాని కన్నా చాలా మెరుగ్గా ఆడటం ఇప్పటికే అభిమానులకు అర్థం కాని విషయమే. మొత్తానికి బాబు తగిన ఫలితం అనుభవించాడు అంటూ వర్మ వ్యక్తం చేస్తున్న సంతోషానికి సోషల్ మీడియాలో మద్దతు కూడా బాగానే దక్కుతోంది. బాబు ప్రతిపక్ష నాయకుడిగా మారక ఇంకెన్ని కామెడీలు చేస్తాడో అని వర్మ మీద అప్పుడే నెటిజెన్లు ఆసక్తి పెంచేసుకుంటున్నారు.