Begin typing your search above and press return to search.

జల్లికట్టుకు దేవుడి మద్దతు లేదట

By:  Tupaki Desk   |   23 Jan 2017 7:42 AM GMT
జల్లికట్టుకు దేవుడి మద్దతు లేదట
X
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మకు.. జల్లికట్టు అస్సలు నచ్చలేదు. తనకు నచ్చని విషయాలపై ఆయనెంత తీవ్రంగా స్పందిస్తారో అందరికి తెలిసిందే. జల్లికట్టుపై కోట్లాది మంది తమిళులు ఏకమై.. పోరాడిన వైనం వర్మకు కోపం వచ్చేలా చేసింది. జల్లికట్టు ఆడేవారిపై ఇప్పటికే బండబూతులు తిట్టేస్తూ ట్వీట్లు చేసేసిన ఆయన.. తాజాగా మరోసారి రియాక్ట్ అయ్యారు.

జల్లికట్టుపై విధించిన నిషేదం ఎత్తివేసిన నేపథ్యంలో జరిగిన జల్లికట్టులో ఇద్దరు మరణించిన ఉదంతంపై వర్మ తాజాగా స్పందించారు. జల్లికట్టు అనాగకరికమని.. వినోదం కోసం మూగజీవుల్ని హింసించటంగా అభివర్ణించే వర్మ.. జల్లికట్టులో మరణించిన వారి గురించి ట్వీట్ చేస్తూ.. ‘‘జల్లికట్టు నిర్వహణలో ఇద్దరు మృతి చెందారు. 129 మంది గాయపడ్డారు. ఇప్పుడు జల్లికట్టు మద్దతుదారులు ఏమంటారు? దీన్ని చూస్తే.. జల్లికట్టుపై దేవుడికి కూడా కోపం ఉన్నట్లుంది ఉంది. జల్లికట్టు మద్దతుదారులపై కోపంచూపిస్తూ.. ఎద్దులపై జాలి చూపిస్తున్నట్లుగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు.

ఈ ఘటనతో అయినా.. అనాగరికమైన జల్లికట్టు క్రీడను ఆపుతారని తాను ఆశిస్తున్నట్లుగా వర్మ పేర్కొన్నారు. దేవుడ్ని ఎటకారం చేసుకుంటూ ఉండే వర్మ.. తాజాగా తన వాదనకు దేవుడ్ని అరువుగా తెచ్చుకొని వినిపించిన వాదన చూస్తే.. అవసరానికి తగ్గట్లుగా ఎవరినైనా తనకు తగ్గట్లుగా తయారు చేసుకొని మాట్లాడతారన్న భావన కలగటం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/