Begin typing your search above and press return to search.

కేసీఆర్ కి రివర్స్ వెళ్తానంటున్న వర్మ!

By:  Tupaki Desk   |   21 Oct 2016 7:31 AM GMT
కేసీఆర్ కి రివర్స్ వెళ్తానంటున్న వర్మ!
X
ఎక్కడ వివాదం ఉండునో.. అక్కడ వర్మ ఉండును అన్నట్లుగా ఉంది వ్యవహారం. రీసెంట్ గానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సినిమా తీస్తున్నామని.. కేసీఆర్ అనే టైటిల్ పైనే సినిమాపై ఉంటుందని ప్రకటించారు నిర్మాత మధుర శ్రీధర్. మరి ఇందులో ఏ వివాదం కనిపించకపోవడంతో.. వర్మ తనే ఒకటి స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది.

కేసీఆర్ పై రివర్స్ సినిమా తీస్తానంటూ ట్వీట్ పెట్టాడు వర్మ. సినిమా పేరేంటో తెలుసా.. 'RCK'. ఎంచక్కా కేసీఆర్ లో ఉండే అక్షరాలనే రివర్స్ చేశాడంతే. 'నేను ఆర్సీకే అని సినిమా తీస్తున్నా. కేసీఆర్ గురించి రివర్స్ లో చూపిస్తుందీ సినిమా. ఆయన బయట కనిపించే విధానం కాకుండా.. ఇంటర్నల్ ఆలోచనలను చూపిస్తా' అంటూ ట్వీట్ పెట్టాడు వర్మ. ఇలాంటి సినిమా అనౌన్స్ మెంట్స్ వర్మ దగ్గర నుంచి చాలానే వస్తుంటాయ్. అసలు వంగవీటికి మించిన స్టోరీ తనకు దొరకదు కాబట్టి.. తెలుగు సినిమా తీయనే తీయను అని కూడా చెప్పిన ఘనాపాటి వర్మ.

రెండేళ్ల క్రితం XES అంటూ సెక్స్ ను తిరగేసి ఓ సినిమా తీస్తున్నట్లు చెప్పి.. పోస్టర్లు వదిలాడు. ఇలాంటి చాలా సినిమాలు ఇప్పటివరకూ అతీ గతీ లేకుండా పోయాయి. అయినా రక్తపాతం.. మర్డర్లు.. గూండాయిజం.. వెంటాడి నరుక్కోవడాలు లేకుండా వర్మకు సినిమా తీయడం అంటే థ్రిల్ ఉండదులే. ఈ RCK గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పనేమీ లేదని ఫిక్స్ అయిపోవచ్చు!