Begin typing your search above and press return to search.

స్పైసీ: లేడీస్ ప‌వ‌ర్ ఇలా చూపిస్తాడా?!

By:  Tupaki Desk   |   2 Oct 2015 6:05 AM GMT
స్పైసీ: లేడీస్ ప‌వ‌ర్ ఇలా చూపిస్తాడా?!
X
ఏంటో మ‌న వ‌ర్మ ఎవ్వ‌రికీ అర్థం కాడు. ఏ సినిమా ఎప్పుడు ఎలా ఎవ‌రిపై తీస్తుంటాడో, దాన్ని ఎప్పుడు ఎలా విడుద‌ల చేస్తుంటాడో ఎవ్వ‌రికీ తెలియ‌దు. ఇటీవ‌ల చ‌డీ చ‌ప్పుడు లేకుండా `బ్రూస్‌ల ీ` తీసేశాడు. ఏకంగా నెట్‌ లో ట్రైల‌ర్ విడుద‌ల చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. `బ్రూస్‌ లీ` అన‌గానే రామ్‌ చ‌ర‌ణ్‌ కి పోటీనా అంటూ అంతా ఆ ట్రైల‌ర్‌ ని ఆస‌క్తిగా చూశారు. తీరా చూస్తే లేడీ బ్రూస్‌ లీ అని అర్థ‌మైంది. ఎక్క‌డెక్క‌డో కెమెరాని పెట్టి లేడీ బ్రూస్‌ లీని య‌మా స్పైసీగా చూపించాడు వ‌ర్మ‌. నిన్న ట్రైల‌ర్ ఒక రేంజ్‌ లో హంగామా చేయ‌గా, ఈ రోజు విడుద‌ల చేసిన పోస్ట‌ర్ మ‌రో రేంజ్‌ లో అద‌ర‌గొడుతోంది. ఈ పోస్ట‌ర్‌ ని ట్విట్ట‌ర్‌ లో పోస్ట్ చేశాడు వ‌ర్మ‌.

హీరోయిన్ కాలుని పైకెత్తించి తీయించిన ఈ స్టిల్ చాలా అద్భుతంగా ఉంద‌నీ, ఫొటోగ్రాఫ‌ర్ చాలా బాగా న‌చ్చాడ‌ని ట్వీట్ చేశాడు వ‌ర్మ‌. అత‌ను మ‌ర‌ణించాడు కానీ... ఆయ‌న ప్ర‌భావం మాత్రం మ‌ర‌ణించ‌లేదు అని బ్రూస్‌ లీని త‌ల‌చుకొంటూ ఈ సినిమాని తీశాడు వ‌ర్మ‌. అయితే ఒక అమ్మాయి ఆధారంగా రూపొందించిన ఈ సినిమాతో మ‌హిళా ప‌వ‌ర్‌ ని చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశాడు వ‌ర్మ‌. అయితే ఈ స్టిల్ చూసిన‌వాళ్లు మాత్రం ``ఇలా ఎలా మ‌హిళల ప‌వ‌ర్‌ ని చూపిస్తాడు ఈ వ‌ర్మ‌, ఇక్క‌డ అందాల ఘాటు త‌ప్ప మ‌రేమీ క‌నిపించ‌డం లేదు`` అని గుస‌గుస‌లాడుకొంటున్నారు.