Begin typing your search above and press return to search.

అమెరికాలో రామ్ చ‌ర‌ణ్ ర‌చ్చ‌

By:  Tupaki Desk   |   25 Sep 2016 1:40 PM GMT
అమెరికాలో రామ్ చ‌ర‌ణ్ ర‌చ్చ‌
X
స్టేజ్ మీద డ్యాన్సులు చేయ‌డానికి మ‌న హీరోలు తెగ నామోషీ ప‌డిపోతుంటారు. ఆ ప‌నిని కొంచెం త‌క్కువ‌గానూ చూస్తుంటారు. ఐతే బాలీవుడ్ సూప‌ర్ స్టార్లే ఇలాంటి డ్యాన్సులు చేస్తున్న‌పుడు మ‌న‌కేంటి అన్న‌ట్లు ఈ మ‌ధ్య రూట్ మారుస్తున్నారు మ‌న హీరోలు. పెద్ద వేడుక‌ల్లో పాదం క‌దుపుతున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ మ‌ధ్యే ఐఫా ఉత్స‌వంలో డ్యాన్స్ చేసి మెప్పించాడు. అందుకోసం పారితోష‌కం కూడా భారీగానే తీసుకున్నాడు. ఇప్పుడు మ‌రోమారు చ‌ర‌ణ్‌.. స్టేజ్ మీద త‌న డ్యాన్సింగ్ టాలెంట్ చూపించ‌బోతున్నాడు. ఆ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌బోయేది అమెరికాలో కావ‌డం విశేషం.

ఐతే చ‌ర‌ణ్ ఈసారి ఏ పారితోష‌కం తీసుకోవ‌ట్లేదు. ఇది ఓ మంచి ప‌ని కోసం చేప‌డుతున్న కార్య‌క్ర‌మం. ఉగ్ర‌వాదుల దాడుల్లో న‌ష్ట‌పోయిన కుటుంబాల్ని ఆదుకోవ‌డం కోసం అమెరికాలో ఈ చారిటీ షో చేస్తున్నారు. రిప‌బ్లిక్ హిందూ కొయెలేష‌న్ షాలి కుమార్ ఆహ్వానం మేర‌కు చ‌ర‌ణ్ అమెరికాకు వెళ్తున్నాడు. న్యూజెర్సీలోని పీఎన్సీ ఆర్ట్ సెంట‌ర్లో ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. అక్టోబ‌రు 15న ఈ షో ఉంటుంది. ఇందుకోసం ‘ధృవ’ షూటింగ్ నుంచి విరామం తీసుకుని అమెరికాకు వెళ్తున్నాడు చ‌ర‌ణ్‌. మెగా అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్య‌క్ర‌మానికి వ‌స్తార‌ని అంచ‌నా. ఓ మంచి ప‌ని కోసం అమెరికా దాకా వెళ్లి షో చేస్తున్నందుకు మెగాస్టార్ త‌న‌యుడిని అభినందించాల్సిందే.