కాలేజ్ లో రామ్ చరణ్ సందడి

Mon Mar 20 2017 17:59:55 GMT+0530 (IST)

కాటమరాయుడు సూపర్ అన్న చరణ్! విశాఖలోని ఓ కాలేజ్ మెగా పవర్ స్టార్ కాలేజ్ లో సందడి చేయడం ఆశ్చర్యం కలిగించింది. అయితే.. ఇదేమీ సినిమా షూటింగ్ కోసం కాదు. ఆ కాలేజ్ ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా దీనికి హాజరయ్యాడు రామ్ చరణ్.

విశాఖలోని అవంతి విద్యాసంస్థలు ఏర్పాటు చేసిన 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన యువజనోత్సవాలకు చెర్రీ హాజరయ్యాడు. మెగా ఫ్యామితీ అవంతి సంస్థకు ఎంతో అనుబంధం ఉందన్న చరణ్.. తాను సహజంగా ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కానని.. కానీ యువతరం ఉండే ఈవెంట్ కావడంతోనే వచ్చానని చెప్పాడు. మెగా ఫ్యామిలీతో యువత చూపిస్తున్న ప్రేమే తనను ఇక్కడకి రప్పించిందన్న రామ్ చరణ్.. తనను వెన్ను నొప్పి వేధిస్తోన్నా.. వారి సంకల్పంతోనే ఇక్కడకు రాగలిగినట్లు చెప్పాడు.

పవన్ కళ్యాణ్ కాటమరాయుడు ట్రైలర్ అత్యధ్భుతంగా ఉందని చెప్పిన చరణ్.. సినిమా ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. తన చిత్రం ధృవ నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 కూడా సక్సెస్ అయ్యాయని. .అలాగే కాటమరాయుడు కూడా బ్లాక్ బస్టర్ నిలుస్తుందని ఆశిస్తున్నట్లు రామ్ చరణ్ చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/