Begin typing your search above and press return to search.

మరో బిజినెస్ లోకి మెగా హీరో

By:  Tupaki Desk   |   13 Dec 2017 5:01 PM GMT
మరో బిజినెస్ లోకి మెగా హీరో
X
టాలీవుడ్ హీరోలు కేవలం సినిమాలతోనే కాకుండా బిజినెస్ లలో కూడా మంచి లాభాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజినెస్ మెన్ లు చాలానే ఉన్నారు. అందులో టాప్ లో ఉన్న హీరో రామ్ చరణ్ అని చెప్పాలి. కెరీర్ మొదట్లో కేవలం తన సినిమాలతోనే లాభాలను అందుకునే చరణ్ ఆ తర్వాత అతి తక్కువ ఏళ్లకే వివిధ రకాల వ్యాపారల్లోకి అడుగుపెట్టి అదృష్టాన్ని పరీక్షించుకొని సక్సెస్ అయ్యాడు.

డొమెస్టిక్ లెవల్లో ట్రూజెట్ ఎయిర్ లైన్స్ ని నడుపుతున్న మెగా పవర్ స్టార్ ఆ తర్వాత కొద్ది కాలానికే సినిమా ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తాడు. తన తండ్రిని రీ-లాంచ్ చేస్తూ.. సొంత ప్రొడక్షన్ లో ఖైదీ నెంబర్ 150 సినిమాను నిర్మించడు. ఆ సినిమా రికార్డ్ స్థాయిలో లాభాలను అందించింది. ఇక ఫూట్ బాల్ - కబడ్డీ లాంటి క్రీడలలో జట్లను కొనుగోలు చేసి అన్ని రంగాల వ్యాపారాలను బాగా తెలుసుకున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే.. రామ్ చరణ్ మరొక కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. త్వరలోనే తెలంగాణ - ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో థియేటర్స్ ని కొనుక్కుంటాడట.

ఇకపోతే ప్రస్తుతం కొంతమంది బడా నిర్మాతలు చాలా వరకు థియేటర్స్ ని వారి ఆధీనంలో ఉంచుకోని కొన్ని చిన్న సినిమాలకు థియేటర్స్ దక్కనివ్వకుండా చేస్తున్నారు అనే ఒక టాక్ ఉంది. ఇప్పుడు చరణ్ కూడా అలాంటి బినేనెస్ లోకి ఎంట్రీ ఇస్తే.. మరి చిన్న సినిమాలకు సమానంగా ధియేటర్స్ ఏమన్నా ఇప్పిస్తాడా? ప్రముఖ యూవీ క్రియేషన్స్ తో కలిసి చరణ్ ఈ బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నాడాట. ఇటీవల ఆ సంస్థ రంగస్థలం నైజాం హక్కులను 18 కోట్లకు అందుకున్న సంగతి తెలిసిందే.