Begin typing your search above and press return to search.

అంత స్పీడుగా సుక్కూ తొక్కేస్తాడా?

By:  Tupaki Desk   |   31 Aug 2016 5:30 AM GMT
అంత స్పీడుగా సుక్కూ తొక్కేస్తాడా?
X
కొన్ని న్యూస్ భలేగా ఉంటాయ్. నిజం అని నమ్మాలని అనిపించకపోయినా.. నిజమైతే బాగుండు కదా అనిపిస్తాయ్. డైరెక్టర్ సుకుమార్ పై ఇప్పుడు అలాంటిదే ఒక రూమర్ లాంటి న్యూస్ హల్ చల్ చేస్తోంది. అది కూడా రామ్ చరణ్ తో చేయనున్న మూవీపై కావడంతో.. దీనికి మరింత ఇంపార్టెన్స్ వచ్చేసింది.

ప్రస్తుతం ధృవ చిత్రాన్ని చేస్తోన్న రామ్ చరణ్.. దసరాకు దీన్ని విడుదల చేశాక సుకుమార్ తో సినిమా చేయనున్నానని చెప్పేశాడు. ఇప్పటికే సుక్కు అండ్ టీం స్క్రిప్ట్ వర్క్ తో పాటే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కానిచ్చేస్తున్నారు. అయితే.. అక్టోబర్ నెలాఖరుకు ప్రారంభం కానున్న ఈ మూవీ విషయంలో.. ఇప్పుడో హాట్ రూమర్ స్ప్రెడ్ అయింది. 2017 ఫిబ్రవరి నాటికి చెర్రీ సినిమాని రిలీజ్ చేసేస్తానని చెప్పాడట సుకుమార్. ఈ మాట వినగానే చాలామంది నోరెళ్లబెట్టేస్తున్నారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో సుక్కు-చెర్రీ సినిమా రావడం ఖాయమేనంటూ లీకులు అందుతున్నాయని కొందరు చెప్పేస్తున్నారు.

అక్టోబర్ చివరలో స్టార్ట్ చేసి.. నిండా నాలుగంటే నాలుగు నెలల టైమ్ లోనే మూవీ రిలీజ్ చేస్తాననడం.. అది కూడా సుకుమార్ సినిమా కావడం.. అన్నిటికంటే పెద్ద వింత అనుకుంటున్నారు చాలా మంది. ఇప్పటికైతే ఇవన్నీ పక్కాగా రూమర్లే అని చెప్పాలి. హీరో రామ్ చరణ్ కానీ.. దర్శకుడు సుకుమార్ కానీ వీటిపై ఓ స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు నమ్మేయచ్చు. అది జరగాలంటే.. ముందు అక్టోబర్ 7న ధృవ రిలీజ్ అవాల్సి ఉంటుంది మరి.