రామ్ చరణ్ మాస్ మసాలా అప్డేట్

Thu Jun 14 2018 11:58:38 GMT+0530 (IST)


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకొని మంచి ఊపు మీద ఉన్న సంగతి తెలిసిందే. నెక్స్ట్ కూడా అదే రేంజ్ లో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. బోయపాటి స్టైల్ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మెగా హీరోల మాస్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని దర్శకుడు మసాలా గట్టిగా తగిలించనున్నాడట.ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమా రెగ్యులర్ షూటింగ్ కి ఏ మాత్రం బ్రేకులు పడటం లేదు. ఇప్పటికే రామ్ చరణ్ తనకు సంబందించిన రెండు చిన్న చిన్న షెడ్యూల్స్ ని పూర్తి చేశాడు. లేటెస్ట్ గా మరో షెడ్యూల్ ని హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు. యాక్షన్స్ సీన్స్ కు సంబందించిన ఈ షెడ్యూల్ ని 15 రోజుల వరకు కొనసాగించనున్నారు. అలాగే కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలను కూడా బోయపాటి స్పెషల్ గా షూట్ చేయనున్నారు. ఇక ఈ షెడ్యూల్ ఫినిష్ అవ్వగానే చిత్ర యూనిట్ యూరప్ వెళ్లనుంది.

అక్కడ రెండు సాంగ్స్ ని చిత్రీకరించనున్నారు. వీలైనంత త్వరగా సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చెయ్యాలని మెగా అభిమానుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. దర్శకుడు కూడా అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించనున్నారు. డివివి.దానయ్య సినిమాను నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.