చెర్రీ-బోయపాటి.. వెనక్కెళ్ళిపోయారు

Mon Apr 16 2018 12:06:42 GMT+0530 (IST)

రంగస్థలం సినిమాతో కెరీర్ కు సరిపడ బూస్ట్ అందుకున్న మెగా పవర్ స్టార్ ప్రస్తుతం పార్టీలతో బిజీగా ఉన్నాడు. పైగా బాబాయ్ పవన్ కళ్యాణ్ నుంచి మంచి ప్రశంసలు అందడంతో సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ఇక నుంచి ఈ స్టార్ డమ్ ని ఏ మాత్రం తక్కువ చేసుకోకుండా చూసుకునేందుకు రామ్ చరణ్ తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు.ప్రస్తుతం చరణ్ చేతిలో మంచి ప్రాజెక్టులున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా తన నటనకు ప్రాముఖ్యత ఉండేలా కథలను ఎంచుకునే విధంగా ఆలోచిస్తున్నాడు. ఇక రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానుల్లో మరో ఆశ మొదలైంది. అసలైతే ఈ దసరాకే ఒక సినిమా ప్రేక్షకుల ముందు ఉండాలి. బోయపాటి దర్శకత్వంలో కొన్ని రోజుల క్రితం ఒక యాక్షన్ ఫిల్మ్ ను లంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాను బోయపాటి దసరాకి రిలీజ్ చేయాలనే విధంగా ప్లాన్ వేసుకున్నప్పటికీ రామ్ చరణ్ బిజీ షెడ్యూల్ వల్ల మరో డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు. ఎందుకంటే జక్కన్న ప్రాజెక్ట్ ఆ సమయంలోనే స్టార్ట్ కానుంది. దీంతో ఫైనల్ గా 2019 సంక్రాంతి బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు.

బోయపాటికి కరెక్ట్ సమయం చెబితే మంచి కంటెంట్ ని ఇస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. రామ్ చరణ్ ఆయనకు షెడ్యూల్ పరంగా సహకరిస్తే పొంగల్ రేస్ లో తప్పకుండా నిలబెడతాడు. కానీ రాజమౌళి ప్రాజెక్టు దృష్ట్యా ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.