చరణ్ మళ్ళీ కష్టపడటం మొదలెట్టాడు

Tue Apr 17 2018 11:18:27 GMT+0530 (IST)

టాలీవుడ్ హీరోల్లో ప్రస్తుతం చాలా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు హీరోగా కనిపిస్తున్నారు అంటే మేకప్ కాస్ట్యూమ్స్ లో తప్ప ఫిట్ నెస్ లో పెద్దగా మార్పులు చేసేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి కథలైన ఫిట్ నెస్ డిమాండ్ చేస్తున్నాయి. దర్శకులు అంత అవసరం లేదు అంటున్నా కూడా కథానాయకులు అస్సలు వినడం లేదు. బాడీ షేప్ మార్చాల్సిందే. మొత్తంగా కొత్తగా కనిపించాలి అని జిమ్ లో కష్టపడుతున్నారు.అయితే రంగస్థలం సినిమాలో సరికొత్తగా కనిపించి హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఫిట్ నెస్ ని ఎప్పటికప్పుడు అదుపులో పెట్టుకుంటారు. రంగస్థలం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంతో ఆయన రేంజ్ చాలా పెరిగిపోయింది. దీంతో నెక్స్ట్ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని కృషి చేస్తున్నారు. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ తన 12వ సినిమా చేయబోతోన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమాలో హీరో ఏ విధంగా కనిపించాలో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇందుకోసం ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్ ట్రైనర్ ను కూడా సహాయం అడిగాడట చరణ్. గతంలో సదరు రాకేష్ ఉడయార్ సాయంతోనే ధృవ సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించాడు చరణ్. ఇప్పుడు కూడా అదే పని చేయబోతున్నాడనమాట.

బోయపాటి అంటే మాస్ ఆడియెన్స్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంటారు. అందుకే ప్రస్తుతం రామ్ చరణ్ జిమ్ వర్కౌట్స్ గట్టిగా చేస్తున్నాడు. కాలి కడుపుతో కొన్ని ప్రయోగాలు చేసున్నారట. అపోలో ఆస్పత్రిలో కార్డియో పూర్తయిందని ఇటీవల ఉపాసన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సరికొత్త ఆకృతి కోసం చరణ్ ప్రయత్నిస్తున్నాడు. మరి ఇంత కష్టపడుతోన్న చరణ్ ఎలా కనిపిస్తాడో చూడాలి.