Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ తో సినిమాకు రంగం సిద్ధం చేస్తున్న చెర్రీ..

By:  Tupaki Desk   |   21 Sep 2018 12:42 PM GMT
ఎన్టీఆర్ తో సినిమాకు రంగం సిద్ధం చేస్తున్న చెర్రీ..
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జోరు మామూలుగా లేదు. ఒకవైపు హీరోగా బిజీగా ఉంటూనే కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమాల నిర్మాణం మొదలుపెట్టాడు. మొదటి సినిమానే డాడీ చిరంజీవి తో చేసి సూపర్ హిట్ కొట్టాడు. 'ఖైది నెంబర్ 150' తర్వాత సెకండ్ ప్రాజెక్ట్ కూడా నాన్నతోనే.. ఈ సారి మరింత భారీ స్పాన్.. స్కేల్ ఉన్న సినిమా 'సైరా' ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం చరణ్ మూడో సినిమా కూడా క్రేజీ ప్రాజెక్టేనట.

ఈ సారి కొణిదెల ప్రొడక్షన్స్ లో హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని సమాచారం. ఈ విషయం గురించి ఎన్టీఆర్ తో చరణ్ మాట్లాడడం.. ఎన్టీఆర్ కూడా ఫార్మల్ గా తన అంగీకారం తెలపడం ఇప్పటికే జరిగాయట. ఇంతకు మించి వివరాలేవీ బయటకు రాలేదు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై హై బడ్జెట్ సినిమాలను నిర్మిస్తానని.. మరో సెకండ్ బ్యానర్ లో స్మాల్ & మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మించే ఆలోచన ఉందని చరణ్ గతంలో తెలిపాడు. మరి స్మాల్ బడ్జెట్ సినిమాల సంగతేమో గానీ.. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ సినిమాలను మాత్రం లైన్లో పెడుతున్నాడు. ఎన్టీఆర్ హీరోగా చరణ్ నిర్మాతగా సినిమా అంటే అది ఆటోమేటిక్ గా క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది.

చరణ్ - ఎన్టీఆర్ ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రేజీ మల్టిస్టారర్ #RRR లో ఇద్దరు మిత్రులూ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఏదేమైనా టాలీవుడ్ స్టార్స్ ఇలా స్నేహితుల్లా కలిసి మెలిసి ఉండడం ఇండస్ట్రీకి మంచిదే. మరోవైపు ఇది ఫ్యాన్స్ కు మంచి మెసేజ్ ఇస్తుంది.