Begin typing your search above and press return to search.

బాబాయి మాటను నిలబెట్టిన అబ్బాయి..!

By:  Tupaki Desk   |   21 Oct 2018 11:48 AM GMT
బాబాయి మాటను నిలబెట్టిన అబ్బాయి..!
X
తిత్లీ తుఫాన్‌ ధాటికి ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీకాకుళం జిల్లాతో పాటు పలు జిల్లాలు తీవ్రంగా నష్టపోయిన విషయం తెల్సిందే. భారీ ఎత్తున ప్రజలు తుఫాన్‌ కారణంగా నిరాశ్రయులు అయ్యారు. ఉత్తరాంధ్ర మొత్తం తిత్లీ తుఫాన్‌ దాటికి విలవిలలాడిన నేపథ్యంలో తాజాగా పవన్‌ కళ్యాణ్‌ అక్కడ పర్యటించి త్వరలో చరణ్‌ తిత్లీ ప్రభావిత ప్రాంతంలోని ఒక ఊరును దత్తత తీసుకుంటాడంటూ హామీ ఇచ్చాడు. పవన్‌ హామీ మేరకు శ్రీకాకుళం ఏరియాలో ఒక గ్రామంను దత్తత తీసుకునేందుకు తాను సిద్దంగా ఉన్నట్లుగా రామ్‌ చరణ్‌ అధికారికంగా ప్రకటించాడు.

బాబాయి శ్రీకాకుళం తిత్లీ తుఫాన్‌ బాధితులను పరామర్శించిన సమయంలో ఒక గ్రామంను దత్తత తీసుకోవాల్సిందిగా సూచించాడు. బాబాయి ఇచ్చిన ఐడియా నాకు నచ్చింది. తప్పకుండా ఒక గ్రామంను దత్త తీసుకుని, నష్టపోయిన గ్రామంను పూర్తిగా బాగు చేయిస్తాను. ఇది నాకు చాలా సంతోషంను కలిగించే విషయం. బాబాయి సలహాను అమలు చేసేందుకు తన టీం సిద్దం అవుతున్నారని, త్వరలోనే ఒక విలేజ్‌ ను ఎంపిక చేసుకుని పనులు మొదలు పెట్టబోతున్నట్లుగా చరణ్‌ అధికారికంగా సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు.

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ వైజాగ్‌ లో బోయపాటి శ్రీను చిత్రం షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు. ఆ షెడ్యూల్‌ పూర్తి అవ్వగానే దత్తత గ్రామం గురించి చర్చించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. బోయపాటి శ్రీను, చరణ్‌ ల మూవీ ఫస్ట్‌ లుక్‌ ను దీపావళికి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.