Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కోసం నేను వెయిట్ చేస్తున్నా: చరణ్

By:  Tupaki Desk   |   7 Jan 2019 5:33 AM GMT
ఎన్టీఆర్ కోసం నేను వెయిట్ చేస్తున్నా: చరణ్
X
సంక్రాంతి సీజన్ సినిమాల విడుదలకు కౌంట్ డౌన్ బిగిన్ అయింది. దీంతో అన్ని సినిమాలకు ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సీజన్లో రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' సినిమా తో ప్రేక్షకులను పలకరించనున్నాడన్న సంగతి తెలిసిందే. రెండు మూడు డిఫరెంట్ సినిమాల తర్వాత ఒక పక్కా మాస్ సినిమాతో రానుండడంతో ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయినా చరణ్ పోటీలో ఉన్న ఇతర సినిమాల గురించి ఎమనుకుంటున్నాడు? ఈ సంగతే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.

సంక్రాంతి సీజన్లో రెండు సినిమాలు పోటీలో రిలీజ్ అయినా పెద్దగా ఇబ్బంది ఉండదని.. ఒక వారం గ్యాప్ ఇచ్చి మరో సినిమాను రిలీజ్ చేసినా బాక్స్ ఆఫీసు దగ్గర క్లిక్ అవుతాయని అభిప్రాయ పడ్డాడు. అందుకే పోటీ గురించి ఏమాత్రం ఆందోళన చెందడం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇక బాలయ్య హీరోగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ గురించి మాట్లాడుతూ అది గౌరవించాల్సిన చిత్రమని.. ఎన్టీఆర్ టీం ఎంతో బాధ్యతతో.. గౌరవంతో ఆ సినిమాను తెరకెక్కించారని అన్నాడు. క్రిష్ ఎలా దాన్ని తెరపైకి తీసుకొచ్చాడో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి నేను కూడా ఆ సినిమా చూసేందుకు వెయిట్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు.

ఇక చరణ్ తమ్ముడు వరుణ్ తేజ్.. వెంకటేష్ తో కల్సి నటించిన 'ఎఫ్ 2' గురించి మాట్లాడుతూ "వెంకీ గారి కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే. దాన్ని ఎవరూ మ్యాచ్ చేయలేరు. అయన ఖచ్చితంగా ఫ్యామిలీ ప్రేక్షకులను మెప్పిస్తారు. వెంకీ గారి పక్కన వరుణ్ ఎలా చేశాడో చూడాలని ఉంది." అన్నాడు. 'ఎఫ్ 2' విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నాడు. సంక్రాంతి కి రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపాడు.