Begin typing your search above and press return to search.

గోవిందానికి సిట్టిబాబు కాంప్లిమెంట్స్..వైర‌ల్!

By:  Tupaki Desk   |   17 Aug 2018 11:07 AM GMT
గోవిందానికి సిట్టిబాబు కాంప్లిమెంట్స్..వైర‌ల్!
X
ప్ర‌స్తుతం టాలీవుడ్ ల్ `గీత గోవిందం` మూవీ హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. `అర్జున్ రెడ్డి` నుంచి `గోవింద్` పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు, విమ‌ర్శకులు, సెల‌బ్రిటీలు ఫిదా అయిపోయారు. టాలీవుడ్ న‌యా సూప‌ర్ స్టార్ విజ‌య్ అని `రౌడీస్` త‌మ హీరోను పొగిడేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రంపై చిరంజీవి -మ‌హేష్ బాబు - రాజ‌మౌళి - స‌మంత‌ - సాయిధ‌ర‌మ్ తేజ్, సుశాంత్ ల‌తో పాటు ప‌లువురు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. తాజాగా, ఈ చిత్రంపై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ స్పందించాడు. అర్జున్ రెడ్డి త‌ర్వాత విజ‌య్ ప‌ర్ ఫెక్ట్ గా మారిపోయాడంటూ....చెర్రీ కితాబిచ్చాడు. గోవింద్ కు చెర్రీ కాంప్లిమెంట్స్ ఇస్తూ తన ఫేస్ బుక్ ఖాతాలో చేసిన పోస్ట్ ...సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

`అర్జున్ రెడ్డి`తో త‌న‌కు వ‌చ్చిన స్టార్ డ‌మ్ గాలివాటం కాద‌ని విజ‌య్ ప్రూవ్ చేశాడు. ‘అర్జున్ రెడ్డి’ వంటి బోల్డ్ క్యారెక్ట‌ర్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు విజ‌య్ కు టైం ప‌డుతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ, క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందించిన `గీత గోవిందం`లో గోవింద్ గా విజ‌య్ ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశాడు. అర్జున్ రెడ్డిని గోవింద్ మ‌ర‌పించాడంటే అతిశ‌యోక్తి కాదు. ఇదే అభిప్రాయాన్ని చెర్రీ త‌న ఫేస్ బుక్ పేజ్ లో వెల్ల‌డించాడు. ‘అర్జున్‌ రెడ్డి తరువాత విజయ్‌ పర్ ఫెక్ట్ గా మారిపోయాడు. విజయ్‌ - రష్మికల సహజ నటన వీనుల విందుగా ఉంది. గోపీ సుంద‌ర్ సంగీతం చాలా బాగుంది. మంచి క‌థ‌ను చ‌క్క‌టి క‌థ‌నంతో ప‌ర‌శురామ్ న‌డిపించారు. పరుశురామ్ కు కంగ్రాట్స్‌. ఈ చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌ కు - టీమ్ జీఏ2కు కంగ్రాట్స్‌’ అని చెర్రీ త‌న ఫేస్‌బుక్ లో చేసిన పోస్ట్ వైర‌ల్ అయింది.