Begin typing your search above and press return to search.

చరణ్ మామ దగ్గరకు వెళ్దాం అంటున్నాడట

By:  Tupaki Desk   |   20 Jan 2019 7:00 AM GMT
చరణ్ మామ దగ్గరకు వెళ్దాం అంటున్నాడట
X
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సంక్రాంతి సీజన్లో 'వినయ విధేయ రామ' సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ స్నేహ ఒక కీలకపాత్రలో నటించింది. ఈ సినిమాలో నటించే సమయంలో స్నేహ మూడేళ్ళ కుమారుడు విహాన్ చరణ్ కు మంచి ఫ్రెండ్ అయ్యాడట. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి వెల్లడించింది.

షూటింగ్ సమయంలో విహాన్ ను మిస్ అయ్యానని తెలిపింది స్నేహ. అంతే కాదు పొద్దునే షూటింగ్ కు బయలుదేరి రావాల్సి ఉండడంతో బాబు కూడా తనను మిస్ అయ్యేవాడని చెప్పుకొచ్చింది. కానీ షూటింగ్ సమయంలో తనతో కొన్ని సార్లు విహాన్ ను షూటింగ్ లొకేషన్ కు తీసుకొచ్చానని అక్కడ చరణ్ విహాన్ తో భలే అడుకున్నాడని చెప్పింది. ఆ తర్వాత చాలాసార్లు 'చరణ్ మామ దగ్గరకు వెళ్దాం' అనేవాడని కూడా తెలిపింది.

ఈ కబుర్లకు తగ్గట్టే విహాన్ తో ఆడుతున్న చరణ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలో చరణ్ బుజ్జి విహాన్ హెయిర్ ను సరి చేస్తూ ఆడుకుంటున్నాడు. విహాన్ హెయిర్ స్టైల్ ట్రెండీగా ఉండడంతో ముచ్చటపడ్డాడేమో. ఏదేమైనా స్నేహా కొడుక్కి భలే మామ దొరికాడు కదా.