రాంచరణ్ పొదుపు మంత్రం!

Thu Jul 12 2018 12:44:22 GMT+0530 (IST)

తన కెరీర్ బెస్ట్ హిట్ మూవీ`రంగస్థలం` తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్....బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలుస్తోంది. వరుస హిట్లతో దూసుకుపోతోన్న బోయపాటి - రంగస్థలంతో బ్లాక్ బస్టర్ కొట్టిన చెర్రీల కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రంపై మెగా అభిమానులకు భారీ అంచనాలున్నాయి. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ  సినిమాపై చెర్రీ స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఈ చిత్రం కథతోపాటు నిర్మాణ వ్యయం విషయంలో కూడా చరణ్ ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ కొంచెం తగ్గించాలని....బోయపాటికి చెర్రీ స్నేహపూర్వక సలహా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తన సినిమాలలో భారీతనం కనిపించేందుకు బోయపాటు ఖర్చుకు వెనకాడని నేపథ్యంలో.....చరణ్ ఈ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.తన సినిమాల్లో రిచ్ లుకు ఉండేలా బోయపాటి కేర్ తీసుకుంటాడు. ఈ క్రమంలో అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చయినా...కాంప్రమైజ్ కాడు. అయితే చరణ్ తో సినిమా విషయంలో కూడా బోయపాటి అలాగే వ్యవహరిస్తున్నాడట. భారీ సెట్టింగ్స్ తోపాటు - విలన్ ఇంట్రడక్షన్ సీన్ కోసం భారీ మొత్తం ఖర్చు చేయించాడట. దీంతో ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే 10 కోట్ల తక్కువకే షూటింగ్ పూర్తి చేయాలని బోయపాటికి చరణ్ స్నేహపూర్వక సలహా ఇచ్చినట్లుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మార్కెట్ ఉందని ఖర్చు చేయించడం సరికాదని నిర్మాతతోపాటు డిస్ట్రిబ్యూటర్లకు కూడా లాభాలు రావాలని చెప్పాడట. అంతేకాదు ఎప్పటికప్పుడు ప్రొడక్షన్ గురించిన వివరాలు తెలుసుకుంటున్నాడని ఫిల్మ్ నగర్ లో టాక్. అయితే చెర్రీ సలహాకు బోయపాటి కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.