Begin typing your search above and press return to search.

తండ్రికి తగ్గ తనయుడిగా చెర్రీ

By:  Tupaki Desk   |   22 July 2018 6:31 AM GMT
తండ్రికి తగ్గ తనయుడిగా చెర్రీ
X
ఇదేదో మేమిచ్చిన కాంప్లిమెంట్ అనుకునేరు. కాదు. నిన్న మెగా డాటర్ నీహారిక నాగ అశ్విన్ కాంబోలో రూపొందిన హ్యాపీ వెడ్డింగ్ వేడుకలో చరణ్ స్పీచ్ చూసి ఫ్యాన్స్ అంటున్న మాట. బయట ఏదైనా పబ్లిక్ స్టేజి మీద మాట్లాడే విషయంలో చాలా బాలన్స్ గా ఉంటారని చిరంజీవికి ఎప్పటి నుంచో పేరు ఉంది. తాను ఏ సభలో ఉన్నాను ఎవరి గురించి మాట్లాడాలి అనేదాని మీద స్పష్టమైన అవగాహనతో అభిమానులు మెచ్చేలా ఎమోషనల్ టచ్ ఇవ్వడం ఆయన ప్రత్యేకత. చరణ్ కూడా ఆ లక్షణాన్ని అందిపుచ్చుకుంటున్నట్టు కనిపిస్తోంది.

నాగబాబు తనయ నీహారిక నటించిన హ్యాపీ వెడ్డింగ్ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన చరణ్ ఎంఎస్ రాజు గారు నాన్నకు కెరీర్ ప్రారంభంలో ఐదు వేలు అవసరానికి ఇచ్చిన సంగతి మొదలుకుని తామేంటో ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్న నీహారిక సుమంత్ అశ్విన్ ల గురించి ప్రత్యేకించి చెప్పిన తీరు అందరిని మెప్పించేలా సాగింది. ఇది చూసిన చిరు సీనియర్ ఫాన్స్ అచ్చం నాన్నలాగే చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నాడని ప్రశంసిస్తున్నారు.

నిజానికి చరణ్ లో ఈ మార్పు గతం మూడేళ్ళ నుంచి బాగా కనిపిస్తోంది. గతంలో తనను కనిపెంచిన నాన్న ముందు మాట్లాడేందుకు కూడా మొహమాటపడిన చరణ్ ఆ తర్వాత అప్పుడప్పుడు ట్రాక్ మిస్ అయ్యేవాడు. ఆ మధ్య ఓ పత్రికలో పవన్ కళ్యాణ్ గురించి ఏదో రాసారని బదులుగా పబ్లిక్ గా కాస్త ఆవేశంగా మాట్లాడిన చరణ్ ఆ తర్వాత మళ్ళి చేసిన ఉదంతాలు లేవు. ఇదంతా నాన్న గైడెన్స్ అయ్యుంటుందని ఫాన్స్ నమ్మకం. ఏది ఎలా ఉన్నా ఇప్పుడిప్పుడే బలమైన మాస్ మార్కెట్ తో ఫాలోయింగ్ పెంచుకుంటున్న చరణ్ లాంటి హీరోలకు ఇలాంటి పరిణితి చాలా అవసరం. అందులోనూ చిరు ఫ్యామిలీ నుంచి ఎందరు హీరోలు వచ్చినా మెగాస్టార్ ఒకే ఒక్క వారసుడిగా ఆ స్టార్ డం ని దశాబ్దాల పాటు మోయాల్సిన బాధ్యత చరణ్ మీద ఉంది. సో ఇలాంటి ప్రవర్తనే నాన్న అభిమానులనే కాకుండా స్వంతంగా తనకంటూ ఇష్టపడే ఫ్యాన్స్ ని ఇస్తుంది.