Begin typing your search above and press return to search.

ధృవ కోసం చెర్రీ స్పెషల్ ట్రైనింగ్

By:  Tupaki Desk   |   6 May 2016 1:34 PM GMT
ధృవ కోసం చెర్రీ స్పెషల్ ట్రైనింగ్
X
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రామ్ చరణ్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మాస్ లో చెర్రీకి ఉన్న పట్టు ఇప్పుడున్న హీరోల్లో ఎవరికీ లేదన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఈ రేంజ్ ని అందుకునేందుకు చరణ్ చాలానే కష్టపడ్డాడు, అలాగే దీన్ని నిలబెట్టేందుకు వైవిధ్యం చూపేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాడు.

ఫైట్స్ - డ్యాన్స్ ల విషయంలో ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా ఉండే ఈ మెగా హీరో.. ఇప్పుడు కోలీవుడ్ మూవీ తని ఒరువన్ రీమేక్ చేస్తున్నాడు. ధృవ అనే వర్కింగ్ టైటిల్ పై ఈ మూవీ తెరకెక్కుతుండగా.. అసలీ సినిమా షూటింగ్ లో ఇప్పటివరకూ చరణ్ యాక్టివ్ గా పాల్గొనలేదు. దీనికి కారణం ఇప్పుడే బయటకు వచ్చింది. లుక్ - ఫిజిక్ విషయంలో మార్పులు చూపించేందుకు చరణ్ డిసైడ్ అయ్యాడట. అందుకోసమే తన వెర్షన్ షూటింగ్ ని ఇంకా స్టార్ట్ చేయలేదని అంటున్నారు. బాలీవుడ్ నుంచి స్పెషలిస్ట్ లను పిలిపించి మరీ హార్స్ రైడింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట చరణ్.

ఇప్పటికే చరణ్ కి ఈ విషయంలో ప్రావీణ్యత ఉన్నా.. హార్స్ రైడింగ్ చేస్తూనే స్టంట్స్ చేయడంలో ట్రైనప్ అవుతున్నాడట. అలాగే అథ్లెటిక్ బాడీ కోసం కూడా ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. సినిమా కోసం సన్నగా కనిపించేలా తన ఫిజిక్ మార్చుకుంటున్నాడని.. చెర్రీ సన్నిహితులు అంటున్నారు. ఈ మొత్తం పరిశీలిస్తే ధృవలో చరణ్ ని దర్శకుడు సురేందర్ రెడ్డి కొత్తగా ప్రెజెంట్ చేయనున్నాడని అర్ధమవుతోంది.