ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ పాత్ర పేరు లీక్ ?

Mon Feb 11 2019 11:50:51 GMT+0530 (IST)

టాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మూవీగా దేశవ్యాప్త సినిమా ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సెకండ్ షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది. గత రెండు రోజులుగా దీని సెట్స్ తాలుకు లీకైన ఫోటోలు ఆన్ లైన్ లో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. జక్కన్న ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకుల బెడద మాత్రం తప్పడం లేదు. ఇంకా హీరొయిన్లు ఖరారు కానప్పటికీ హీరోలకు సంబంధించిన కాంబో సీన్లతో పాటు సోలో సన్నివేశాలు కూడా రాజమౌళి శరవేగంగా పూర్తి చేస్తున్నారు.ప్రస్తుత షూట్ చరణ్ మీద మాత్రమే జరుగుతోంది. తర్వాత తారక్ వచ్చాక చెర్రి రిలీఫ్ అవుతాడు. కొంత టైం తీసుకుని ఈ ఇద్దరు కలిసి జాయిన్ అవుతారు. ఇదిలా ఉండగా చరణ్ పాత్రకు సంబంధించిన మరో కీలకమైన అప్ డేట్ ఇప్పుడు బయటికి వచ్చింది. అది పాత్ర పేరు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇందులో చరణ్ పేరు రామరాజు అని తెలిసింది. సౌండింగ్ చాలా పవర్ ఫుల్ గా ఉంది.

అల్లూరి సీతరామరాజులో చివరి పేరుని తీసుకుని ఆ లక్షణాలు పాత్రలో ఉండేలా రాజమౌళి సెట్ చేసాడని టాక్. తొలుత బ్రిటిష్ పాలనలో ఉండే పోలీస్ ఆఫీసర్ గా చరణ్ కనిపిస్తాడని అయితే దేశభక్తి నరనరాల్లో నింపుకున్న రామరాజుగా సరైన సమయం కోసం ఎదురు చూస్తూ వాళ్ళను దెబ్బ కొట్టేందుకు వ్యూహం పన్నుతాడని అందులో భాగంగా వచ్చే ఇంట్రడక్షన్ ఫైట్ నే ఇప్పుడు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులతో తీస్తున్నట్టు తెలిసింది.

అయితే తారక్ ఎపిసోడ్ కూడా దీనికి ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో ఉంటుందట. దాని ప్రీ ప్లానింగ్ కూడా మరోవైపు జరిగిపోతున్నట్టు సమాచారం. ఇది విన్న మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మూడు ఆర్ లలో ఒక ఆర్ చరణ్ చేస్తున్న రామరాజు అని తెలిసిపోయింది. మరి రెండో ఆర్ తారక్ పేరు అయ్యుంటుంది. ఆ మూడో ఆర్ మాత్రం సస్పెన్స్. అయితే షూటింగ్ ప్రారంభంలో వచ్చిన రామరావణ రాజ్యంతో ఇది కనెక్ట్ అవుతున్నట్టే అనిపిస్తోంది. ఇంకొద్ది రోజులు ఆగితే క్లారిటీ వచ్చేస్తుందిగా