'జస్టిస్ ఫర్ ప్రణయ్' కు రాంచరణ్ సపోర్ట్!

Tue Sep 18 2018 19:42:01 GMT+0530 (IST)

ప్రణయ్ దారుణ హత్యోదంతం...ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రణయ్ దారుణ హత్య ను ఖండిస్తూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రణయ్ కు న్యాయం జరగాలని....నిందితులకు కఠిన శిక్షలు పడాలని కోరుతూ అమృత....ఓ క్యాంపెయిన్ ను స్టార్ట్ చేసింది. `జస్టిస్ ఫర్ ప్రణయ్`పేరుతో అమృత ఫేస్ బుక్ ట్విటర్ లలో మొదలు పెట్టిన క్యాంపెయిన్ కు విపరీతమైన స్పందన వస్తోంది. `జస్టిస్ ఫర్ ప్రణయ్`కు ఫేస్ బుక్ లో ఇప్పటికే 82వేల లైకులు వచ్చాయి. ట్విటర్ లో కూడా `జస్టిస్ ఫర్ ప్రణయ్` ట్రెండింగ్ లో ఉంది. ఈ క్రమంలో తాజాగా `జస్టిస్ ఫర్ ప్రణయ్`కు టాలీవుడ్ హీరో రామ్ చరణ్ మద్దతు తెలిపాడు. ప్రణయ్ హత్యను తీవ్రంగా ఖండిస్తూ మెసేజ్ పెట్టాడు. ఈ తరహా పరువు హత్యలు తనను తీవ్రంగా కలచివేశాయని అన్నాడు.ఒక వ్యక్తి ప్రాణం తీయడంలో పరువు ఎక్కడ ఉందని చెర్రీ ప్రశ్నించాడు. సమాజంలో సంఘజీవులమైన మనం ఎటుపోతున్నామని...ఇటువంటి ఘటనలు జరగడం బాధాకరమని అన్నాడు. అమృత ప్రణయ్ కుటుంబాలకు చెర్రీ ప్రగాఢ సానుభూతిని తెలిపాడు. ప్రణయ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నాడు. అంతకుముందు అత్యంత అమానుషంగా జరిగిన ఆ హత్యను పలువురు సినీ ప్రముఖులు సెలబ్రిటీలు తీవ్రంగా ఖండించారు. టాలీవుడ్ హీరోలు మంచు మనోజ్ నిఖిల్ రామ్ లతో పాటు సింగర్ చిన్మయి కూడా ఈ హత్యను తీవ్రంగా ఖండించింది. కుల పిచ్చి ఉన్న సినీ నటులు(ఫ్యానిజం) రాజకీయ పార్టీలు కాలేజ్ యూనియన్లు కుల మత సంస్థలు అన్నీ అనాగరికమైనవేనని మనోజ్ అన్నాడు. మనుషుల్లా ప్రవర్తిద్దామని కులరహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దామని మనోజ్ పిలుపునిచ్చాడు.