Begin typing your search above and press return to search.

కత్తిలాంటోడు.. చెర్రీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   29 July 2016 8:15 AM GMT
కత్తిలాంటోడు.. చెర్రీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు
X
మెగా 150పై ప్రారంభానికి ముందు బోలెడన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయ్. అన్నిటిని క్లారిఫై చేస్తూ మొత్తానికి సినిమా మొదలుపెట్టి ఓ నెల్లాళ్లు దాటింది. ఇప్పుడు కొత్త కన్ఫ్యూజన్స్ మొదలైపోయాయి. వాటిలో మెగాస్టార్ సినిమాకి ఏం టైటిల్ సెట్ చేస్తారనేది మెయిన్.

ఇప్పటికే చిరు చిత్రంపై పలు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ముందు నుంచి ఈ సినిమాకి కత్తిలాంటోడు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రీసెంట్ గా నెపోలియన్ అనే టైటిల్ ని ఓ మీడియా రిలేషన్స్ కంపెనీ లీక్ చేసింది. దానికి ముందే ఖైదీ నెంబర్ 150 అంటూ ఓ ఫీలర్ బయటకు వచ్చింది. అన్నిటి మీదా పాజిటివ్ బజ్ ఉండగా.. నాన్న సినిమాకి కత్తిలాంటోడు టైటిల్ కాదంటూ స్వయంగా చెప్పాడు రామ్ చరణ్. ఇప్పుడు అదే టైటిల్ ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఫిలిం ఛాంబర్ లో రామ్ చరణ్ రిజిస్టర్ చేయించడం విశేషం.

అటు ఆ టైటిల్ కాదని చెప్పిన చరణ్.. కొన్ని రోజులకే అదే టైటిల్ ని రిజిస్టర్ చేయించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అటు కాదని చెబుతూ.. ఇటు అదే టైటిల్ ని రిజిస్టర్ చేయించడం అంటే గందరగోళం సృష్టించడమే. అలాగని ఇదే టైటిల్ ని ఫైనల్ చేయాలని రూల్ ఏం లేదు కానీ.. ఇప్పటికే హీరోయిన్ ఎవరో తేలకుండా ఓ కన్ఫ్యూజన్ ఉంటే.. మళ్లీ టైటిల్ విషయంలో ఎందుకో అర్ధం కాని విషయం.