Begin typing your search above and press return to search.

రంగస్థలం శాటిలైట్ కు మెగా ఆఫర్

By:  Tupaki Desk   |   22 Jun 2017 7:24 AM GMT
రంగస్థలం శాటిలైట్ కు మెగా ఆఫర్
X
టాలీవుడ్ స్టార్స్ సినిమాలకు బడ్జెట్ పెరుగుతోంది. దానికి తగ్గట్టు మార్కెట్ కూడా విస్తృతమవుతోంది. ముఖ్యంగా శాటిలైట్ రైట్స్ ద్వారా వస్తున్న ఆదాయం చాలా కీలకంగా మారుతోంది. కొత్త సినిమాల టెలికాస్ట్ కోసం టీవీ ఛానళ్ల మధ్య పెరుగుతున్న పోటీ నిర్మాతలకు వరంగా మారింది. క్రేజీ ప్రాజెక్టుల శాటిలైట్ రైట్స్ కు విపరీతమైన పోటీ ఉంది. సినిమా బడ్జెట్ లో 20 శాతం వరకు శాటిలైట్ హక్కుల రూపంలో తిరిగి వస్తుండటం నిర్మాతలకు కూడా ఆనందం కలిగిస్తోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ప్యూర్ విలేజ్ బ్యాక్ గ్రౌండ్ సినిమా రంగస్థలం 1985 శాటిలైట్ కు రికార్డు స్థాయి ఆఫర్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ గెటప్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికితోడు టైటిల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండటం... 80ల నాటి ప్రేమకథతో ఈ సినిమా తీస్తుండటం ప్లస్ పాయింట్ గా మారింది. దీంతో ఈ సినిమా శాటిలైట్ కోసం ఓ టీవీ ఛానల్ రూ. 16 కోట్లు ఆఫర్ చేసిందనే విషయం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. రామ్ చరణ్ సినిమాలన్నింటిలో ఫ్యాన్సీరేటు ఇదే కావడం విశేషం. కొద్దిరోజుల్లో ఈ డీల్ ఫైనల్ అవడంతో పాటు ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

రంగస్థలం 1985 సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి థియేటర్లకు తీసుకురావాలని చూస్తున్నారు. అక్కనేని వారింటికి కాబోయే కోడలు సమంత ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/