ఆ కటౌట్ కి విజన్ కి సంబంధం లేదు!!

Tue Dec 18 2018 22:46:59 GMT+0530 (IST)

మంగళవారం సాయంత్రం హైదరాబాద్ జేఈఆర్ సీలో జరిగిన అంతరిక్షం ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు సంకల్ప్ తన లైఫ్ బెస్ట్ కాంప్లిమెంట్ అందుకున్నాడు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అంతటి వాడి నుంచే గొప్ప ప్రశంసను దక్కించుకున్నాడు. ``ఆయన సైజ్ కి ఆయన విజన్ కి సంబంధం లేదు.... ఆయన కటౌట్ కి ఆయన విజన్ కి సంబంధం లేదు`` అంటూ సంకల్ప్ ని పొగిడేశాడు చరణ్.  మనిషి కంటే ఆలోచన గొప్పది. అది గొప్పగా ఉన్న వాళ్లు ఎప్పుడు దిగజారరు.. ఎప్పుడైనా ఉన్నత స్థాయిలో ఉంటారు. సినిమా అయినా రాజకీయం అయినా ఆ ఆలోచనే గొప్పది... అంటూ పొగిడాడు. అలాంటి గ్రేట్ ఆలోచన ఉన్న వాళ్లలో రాజమౌళి - సుకుమార్ - క్రిష్  ఉన్నారు. వీళ్లకన్నా గొప్ప స్థాయికి రావాలి సంకల్ప్... అని అన్నాడు.పనిలో పనిగా చరణ్ మాట్లాడుతూ.. బాబాయ్ పవన్ కల్యాణ్ ఆలోచనల్ని - ఆశయాల్ని పొగిడేశాడు.  మొన్ననే బాబాయ్ (పవన్) చెప్పిన మాటలు గుండెల్లోకి దూసుకెళ్లిపోయాయి. ప్రతిరోజూ భయంతో మన ఆలోచనలను ఆపేసే ఒక పని చేసి విజయం సాధించాలని ఆయన చెప్పిన మాటలు చాలా గట్టిగా అనిపించాయి. ఆయన చెప్పాడని కాదు.. భావాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు.

తమ్ముడు గురించి మాట్లాడిన చరణ్ ఆకాశానికెత్తేశాడు. వరుణ్ ఎప్పుడూ సర్ ప్రైజ్ చేస్తూనే వచ్చాడు. చాలా సార్లు ఆనంద పడ్డాను. అసూయ పడ్డాను. ఈ సినిమా చూసి జెలసీ ఫీలవుతున్నాను.. అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి అవకాశాలు దగ్గరికి రావు. వరుణ్ డెడికేషన్ గొప్పది.. తన ఆలోచన తీరే గొప్పగా ఉంది. ఆలోచనే మనకు ఇష్టమైన వారిని దగ్గరకు చేస్తుంది. పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవారికి మంచే జరుగుతుందని నమ్ముతాను.. అంటూ చరణ్ ఉద్వేగంగా మాట్లాడాడు. మొత్తానికి వరుణ్ - సంకల్ప్ కి ఇంతకంటే బెస్ట్ ప్రశంసలేవీ ఇకపై రావేమో?