సమంతతో యాక్ట్ చేస్తే.. అది వచ్చేస్తుందట

Mon Mar 19 2018 09:52:38 GMT+0530 (IST)

సమంత గురించి  కొత్త విషయాన్ని చెప్పుకొచ్చాడు రాంచరణ్. ఇప్పటివరకూ ఆమె ఎంతోమంది హీరోలతో నటించినా.. ఎవరి నుంచి రాని సరికొత్త అప్రిషియేషన్ రాంచరణ్ నుంచి వచ్చింది. రంగస్థలంలో సమంతతో చెర్రీ జతకట్టిన సంగతి తెలిసిందే.విశాఖలో జరిగిన రంగస్థలం ప్రీరిలీజ్ ఫంక్షన్ సందర్భంగా మాట్లాడిన రాంచరణ్.. మిగిలిన ఫంక్షన్లో మాదిరి తన తోటి నటీనటుల గురించి గొప్పగా పొగిడేశాడు. సమంత గురించి తాను ప్రత్యేకంగా చెప్పాలంటూ.. ఎమోషనల్ అయిపోయాడు.

తాను పదేళ్లుగా సినిమాల్లో యాక్ట్ చేస్తున్నానని.. కానీ రంగస్థలంలో సమంతతో చేసేటప్పుడు ఏదో ఒక ఎనర్జీ వచ్చిందని.. ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుందని.. ఒక మంచి కో స్టార్ దొరికితే.. ఏ ఆర్టిస్ట్ అయినా బాగా పెర్ఫామ్ చేయటానికి ఛాన్స్ ఉంటుందని.. చాలా ఈజ్ తో సమంతతో చేసిన ప్రతి సీన్ ఎంతో అందంగా వచ్చిందని.. అందుకు ఆమెకు తాను స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నట్లుగా చెర్రీ చెప్పారు.

సామ్ ను పొగిడేసే క్రమంలో అబ్బాయ్.. బాబాయ్ ప్రస్తావన తెచ్చారు. సమంతతో పని చేసిన ప్రతి హీరో.. కల్యాణ్ బాబాయ్ నుంచి ఏ ఆర్టిస్ట్ అయినా డిఫరెంట్ గా కనిపిస్తారన్నారు. అత్తారింటికి దారేది సినిమాలో బాబాయ్ ఎలా ఉంటాడో అందరికి తెలిసిందేనని.. అదే విషయాన్ని సమంతతో తాను చెప్పినట్లు చెప్పాడు. సమంత స్పెషాలిటీని అందరికి అర్థమయ్యేలా చెర్రీ చెప్పినందుకు మనం కూడా థ్యాంక్స్ చెబుదాం.