Begin typing your search above and press return to search.

మాట తప్పుతున్నావ్ రామ్ చరణ్‌!!

By:  Tupaki Desk   |   27 Feb 2017 8:18 AM GMT
మాట తప్పుతున్నావ్ రామ్ చరణ్‌!!
X
ఇప్పటివరకు రామ్ చరణ్‌ ఎన్ని సినిమాలు చేశాడు? వచ్చి పదేళ్లు అవుతుంటే కూడా మనోడు మాత్రం పట్టుమని పది తెలుగు సినిమాలు చేశాడు. అప్పట్లో ఆరెంజ్ వంటి డిజాష్టర్ తరువాత.. పెద్దగా గ్యాప్ తీసుకుని.. ఇక నుండి సంవత్సరానికి రెండు సినిమాలను అందిస్తానంటూ శపథం చేశాడు. కాని ఇప్పుడు చూస్తుంటే చెర్రీ మాటతప్పుతున్నాడనే అనుకోవాలి.

నిజానికి పెద్ద పెద్ద హీరోలందరూ వరుసగా సినిమాలు చేస్తే ఇండస్ర్టీలో చాలా ఎక్కువమందికి పని దొరుకుతుంది. అయితే వరుసగా రొటీన్ కథలే దొరకడం.. అనవసరంగా నిర్మాతల డబ్బులు వేస్ట్ అవుతుండటంతో.. రామ్ చరణ్‌ చాలాసార్లు గ్యాప్ ఎక్కువే తీసుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో ''ధృవ'' సినిమాను అత్యంత స్పీడుగా ఫినిష్‌ చేశాడు కాని.. ఆ తరువాత మనోడు సుకుమార్ సినిమాను డిసెంబర్ 2016లో మొదలెడతాడని అనుకుంటే.. ఏకంగా మార్చి నెల వచ్చేస్తున్నా కూడా ఇంకా అజాపజా లేదు. ఫిబ్రవరి నుండి షూటింగ్ అంటూ ముహూర్తం ఈవెంట్ అయితే చేసేశారు కాని.. సుకుమార్ కు లొకేషన్లు నచ్చలేదని.. చరణ్‌ కు ఇంకా ప్రిపరేషన్ కు టైమ్ కావాలంటూ టైమ్ మాత్రం తెగ వేస్ట్ చేస్తున్నారు. చూస్తుంటే ఈ ఏడాది చరణ్‌ ఆ ఒక్క సినిమాతోనే సరిపెట్టేస్తాడని అనిపిస్తోంది.

మరి మెగా ఫ్యాన్స్ కు కంటిన్యూస్ గా సినిమాలను అందిస్తానంటూ చరణ్‌ చేసిన ప్రామిస్ గాలికి వదిలేస్తున్నట్లేనా? ఏమంటావు చరణ్‌?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/