ఆర్ ఆర్ ఆర్ సరే మరి సైరా సంగతేంటి ?

Fri Mar 15 2019 09:51:37 GMT+0530 (IST)

విడుదలకు ఇంకో ఏడాది నాలుగు నెలల టైం ఉన్న ఆర్ ఆర్ ఆర్ ప్రెస్ మీట్ ని ఏదో ఆడియో ఫంక్షన్ తరహలో హైప్ ని క్రియేట్ చేయడం చూసి జాతీయ మీడియా సైతం ఆశ్చర్యపోయింది. నిన్న దాదాపు అన్ని సంస్థల వెబ్ సైట్స్ తో పాటు ప్రింట్ వెర్షన్స్ లో దీనికి సంబంధించిన హెడ్ లైన్స్ సినిమా పేజీలో హై లైట్ అయ్యాయి. కనీసం ఫస్ట్ లుక్స్ లేవు. పోనీ టైటిల్ డిసైడ్ చేశారా అంటే మీరే పంపండి అంటూ ప్రేక్షకులకే పజిల్ పెట్టారు.హీరొయిన్లు ఎవరూ మీట్ కు రాలేదు. సముతిరఖని అజయ్ దేవగన్ తప్ప ఇంకెవరి పేర్లు బయటపెట్లలేదు. అయినా ఆర్ఆర్ఆర్ ఫీవర్ తో నిన్న అభిమానులతో పాటు మీడియా మొత్తం ఊగిపోయింది. ఇప్పుడు ఈ సందర్భంగానే సైరా ప్రస్తావన తెస్తున్నారు మెగా ఫ్యాన్స్. చాలా రోజుల నుంచి సైరా టీం సైలెంట్ గా ఉంది. నటీనటుల్లో ఎవరిదైనా పుట్టినరోజు వస్తే వాళ్ళ లుక్ తో ఓ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసి దానికి బ్యాక్ గ్రౌండ్ గా ఒకే మ్యూజిక్ ని సెట్ చేయడం తప్ప ఇంకే యాక్టివ్ ప్రమోషన్ చేయడం లేదు. దసరాకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చరణ్ ఇంతకు ముందే హింట్ ఇచ్చాడు. సో టైం చాలా తక్కువగా ఉంది.

రెండు వందల కోట్ల బడ్జెట్ తో మెగాస్టార్ రెండేళ్ళ గ్యాప్ తర్వాత స్వతంత్ర సమరయోధుడి పాత్ర చేస్తుంటే హైప్ తెచ్చే ప్రయత్నాలు జరగకపోవడం పట్ల చిరు ఫ్యాన్స్ నిర్మాత చరణ్ ను ప్రశ్నిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ కు బోలెడు టైం ఉంది కాని సైరా పబ్లిసిటీ స్పీడ్ ని పెంచమని కోరుతున్నారు. రిలీజ్ డేట్ ని ఖచ్చితంగా ప్రకటిస్తే కొంతమేర వాళ్ళు కూలైపోయి హైప్ పెరగడం మొదలవుతుంది. ఎంత మెగాస్టార్ సినిమా అయినప్పటికీ భారీ బడ్జెట్ కాబట్టి కొంత స్పెషల్ ఫోకస్ అవసరం. ప్రస్తుతం సైరా షూటింగ్ అమితాబ్ బచ్చన్ బాలన్స్ సన్నివేశాల కోసం హైదరాబాద్ లోనే జరుగుతోంది