Begin typing your search above and press return to search.

చెర్రీ నెక్ట్స్ సినిమా గౌత‌మ్ మీన‌న్‌తోనే!

By:  Tupaki Desk   |   3 Sep 2015 12:02 PM GMT
చెర్రీ నెక్ట్స్ సినిమా గౌత‌మ్ మీన‌న్‌తోనే!
X
ప‌రిశ్ర‌మ‌లో శ‌ర‌వేగంగా స‌మీక‌ర‌ణ‌లు మారిపోతుంటాయి. ఈ రోజు తీసుకొన్న నిర్ణ‌యం రేప‌టి వ‌ర‌కు కంటిన్యూ అవుతుందో లేదో తెలియ‌దు. జయాప‌జ‌యాలు అవ‌కాశాల్ని తారుమారు చేస్తుంటాయి. నిన్న‌టిదాకా అనుకొన్న కాంబినేష‌న్ రేపు ఉండ‌క‌పోవ‌చ్చు. అస‌లు ఊహించ‌ని రీతిలో కొత్త కాంబినేష‌న్లు సెట్ట‌వ్వొచ్చు. అందుకే ఇది చిత్ర ప్ర‌పంచ‌మైంది. ప‌రిశ్ర‌మ‌ని ద‌గ్గ‌ర్నుంచి చూస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ ఇవ‌న్నీ అనుభ‌వ‌మే. మొన్న‌టికి మొన్న సురేంద‌ర్‌రెడ్డి 'రేసుగుర్రం' తో అల్లు అర్జున్‌ కి హిట్టిచ్చేస‌రికి యువ క‌థానాయ‌కుల చూపంతా ఆయ‌న‌పై ప‌డింది. అలాంటి ద‌ర్శ‌కుడితో సినిమా చేయాల్సిందే అన్న అభిప్రాయాలు చాలా మంది యువ క‌థానాయ‌కుల నుంచి వినిపించాయి. రామ్‌చ‌ర‌ణ్ కూడా సురేంద‌ర్‌రెడ్డి తో సినిమా చేయాల్సిందే అని డిసైడైయ్యాడు. క‌థ కూడా రెడీ చేసుకోమ‌ని చెప్పాడు. అయితే ఇంత‌లో ఆయ‌న‌కి 'కిక్‌2' రూపంలో ఫెయిల్యూర్ వ‌చ్చింది. ఇప్పుడు ఆ కాంబినేష‌న్ గురించి ఇండ‌స్ట్రీ అంతా సందేహం వ్య‌క్తం చేస్తోంది.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సూరీతో సినిమా చేయడేమో అని అంటున్నారు . మ‌రోప‌క్క చ‌ర‌ణ్‌తో సినిమా చేయాల‌ని త‌మిళ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ ఉవ్విళ్లూరుతున్నాడు. చెర్రీ ఛాన్స్ ఇవ్వాలి కానీ ఆయ‌న‌తో ల‌వ్‌, యాక్ష‌న్ మిక్స‌యిన ఓ సినిమాని తీస్తాన‌ని చెబుతున్నాడు. చెర్రీ కూడా ఇప్ప‌టికే గౌత‌మ్‌మీన‌న్ చెప్పిన క‌థ విని ప‌చ్చ‌జెండా ఊపేసిన‌ట్టు తాజాగా టాలీవుడ్ వ‌ర్గాలు మాట్లాడుకొంటున్నాయి. ప్రస్తుతం శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో 'బ్రూస్ లీ' చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా మ‌రో నెల రోజుల్లో పూర్త‌వుతుంది. ఆ లోపు కొత్త సినిమాకి అంతా రెడీ చేసుకోవాల‌ని చ‌ర‌ణ్ భావిస్తున్నారు. అందుకే గౌత‌మ్‌ మీన‌న్‌ ని పిలిపించుకొని క‌థ విన్న‌ట్టు తెలుస్తోంది. అయితే మెగా కాంపౌండ్ వ‌ర్గాలు మాత్రం చ‌ర‌ణ్ గౌత‌మ్ మీన‌న్‌ తో సినిమా చేయాల‌నుకొంటున్న మాట నిజమే కానీ... ఇంకా క‌థ మాత్రం విన‌లేద‌ని చెబుతున్నాయి.