Begin typing your search above and press return to search.

ఆర్ ఆర్ ఆర్ తరువాత చరణ్ సినిమా ?

By:  Tupaki Desk   |   21 March 2019 4:54 AM GMT
ఆర్ ఆర్ ఆర్ తరువాత చరణ్ సినిమా ?
X
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి అల్లూరి సీతారామరాజుగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడా అనే ఉత్సుకత కలగడం సహజం . దానికి ఇంకా టైం ఉన్నప్పటికీ ఈసారి కథలు దర్శకుల ఎంపికలో ఎలాంటి పొరపాటుకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం.

వినయ విధేయ రామ విషయంలో చరణ్ పబ్లిక్ గా సారీ చెప్పేంత దారుణమైన ఫలితాన్ని అందుకోవడం అభిమానులకు డైజెస్ట్ కాలేదు. అందుకే ఆర్ ఆర్ ఆర్ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా మరోవైపు కొత్త స్క్రిప్ట్ లు వింటూనే ఉన్నాడట చరణ్. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజమౌళి సినిమా తర్వాత గీతా ఆర్ట్స్ లో ఎప్పటి నుంచో సహాయ దర్శకుడిగా చేస్తూ మంచి పేరున్న ఓ డైరెక్టర్ డెబ్యు చరణ్ మూవీ ద్వారా చేయించే ఆలోచన జరుగుతున్నట్టు తెలిసింది.

ఈ బ్యానర్ లో చరణ్ మగధీర-ధ్రువ చేస్తే రెండూ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. హ్యాట్రిక్ కాంబో కాబట్టి కథ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని మరో నాలుగైదు నెలల్లో చరణ్ కు ఫుల్ నేరేషన్ ఇచ్చాక గ్రీన్ సిగ్నల్ వస్తే సంక్రాంతి నుంచి షూటింగ్ ప్రారంభించేలా ప్లానింగ్ జరుగుతోందట. దీనికి సంబందించిన పూర్తి స్పష్టత ఇప్పట్లో రాదు కానీ సదరు దర్శకుడి పేరు మాత్రం సీక్రెట్ గా ఉంచుతున్నారు